సమంత సీక్రెట్‌ ఎంగేజ్‌మెంట్‌!?

సమంత సీక్రెట్‌ ఎంగేజ్‌మెంట్‌!?

 హీరో సిద్ధార్థ్‌తో ప్రేమాయణం సాగిస్తున్నప్పటికీ ఆ విషయాన్ని గుట్టుగా ఉంచడానికే సమంత ఇష్టపడుతోంది. తమ గురించి అందరికీ తెలిసిపోయినా కానీ వారిద్దరూ మాత్రం తమ ప్రేమ విషయాన్ని ఇంత వరకు పబ్లిగ్గా ప్రస్తావించలేదు. అయితే వీరిద్దరూ చాలా డీప్‌గా లవ్‌లో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం మాత్రం జరుగుతూనే ఉంది. ఈ కమిటెడ్‌ రిలేషన్‌లో వీరిద్దరూ మరో అడుగు ముందుకు వేసారని గుసగుసలు బాగా గట్టిగా వినిపిస్తున్నాయి. సమంత వేలికి ఉన్న వజ్రపుటుంగరం చూసి ఆమె ఎంగేజ్‌మెంట్‌ అయిపోయిందని మీడియా రచ్చ చేస్తోంది. ఇంకా దీనిపై సమంత, సిద్ధార్థ్‌ స్పందించలేదు. అసలు స్పందిస్తారో లేదో తెలీదు. కానీ ఇంతకాలం ఆమె చేతికి లేని ఈ స్పెషల్‌ ఉంగరం ఖచ్చితంగా ఎంగేజ్‌మెంట్‌ రింగే అని మాత్రం మీడియా బల్లలన్నీ గుద్ది పారేస్తోంది.

సమంత ఇప్పుడు కొత్త సినిమాలు అంగీకరించడం ఆపలేదు. ఆమె ఈమధ్యే మూడు కొత్త సినిమాలకి సంతకం చేసింది. అంటే వచ్చే ఏడాది వరకు ఆమె పెళ్లి చేసుకోవడం అయితే ఇంపాజిబుల్‌ అనిపిస్తోంది. ఆమెకి ఉన్న డిమాండ్‌ని బట్టి మరో రెండేళ్లు అయినా ఆమెకి అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎంగేజ్‌మెంట్‌ చేసుకోవడం వల్ల ఏంటి లాభం? బహుశా ఇది సిద్ధూ, సామ్‌ ఒకరికి ఒకరు ఇచ్చుకున్న భరోసా అనుకోవాలా లేక అసలు ఈ ఉంగరానికి అంత సీనే లేదని సరిపెట్టుకోవాలా?


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English