కెలకమాకు దేవరకొండా!

కెలకమాకు దేవరకొండా!

విజయ్ దేవరకొండకి ఏ యువ హీరో అయినా కుళ్ళుకునే లెవల్ క్రేజ్ వచ్చేసింది. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సినిమాలు కెరీర్ లో తొందరగా పడాలంటే ఏ హీరో అయినా తలకిందులుగా తపస్సు చేయాలి. అయితే ఇలాంటి విజయాలు వచ్చిన తర్వాత ఆ రేంజ్ నిలబెట్టుకోవడం అసలు సవాల్. విజయ్ దేవరకొండకి అదే చేతకావడం లేదు. వరుస విజయాలు రావడంతో అన్నీ తనకే తెలుసు అనే ఫీలింగ్ అతనికి వచ్చేసింది. అందుకే దర్శకుల పనిలో జోక్యం చేసుకోవడం మొదలు పెట్టాడు.

డియర్ కామ్రేడ్ చిత్రానికి కొత్త దర్శకుడిని పూర్తిగా పక్కన పెట్టాడనే టాక్ ఉంది. తాజాగా వరల్డ్ ఫేమస్ లవర్ కి కూడా అదే చేసాడట. ముఖ్యంగా పతాక సన్నివేశాలు మార్చేసి తనకి నచ్చినట్టు తీసుకున్నాడట. అందుకే గత ఏడాదిలోనే రావాల్సిన ఈ చిత్రం ఫిబ్రవరి వరకు వచ్చింది. తీరా అతను  చేసిన మార్పు చేర్పులు మైనస్ అనే టాక్ రావడంతో సదరు నిర్మాత అతడిని తిట్టి పోస్తున్నాడట. సినిమా ప్లాప్ అయితే సాధారణంగా దర్శకుడినే నిందిస్తారు. కానీ విజయ్ దేవరకొండ సినిమాలకు అతడినే అంటున్నారు.

ఇందుకు అతని జోక్యమే కారణం అనుకోవచ్చు. ఈ రెండు సినిమాల అనుభవంతో అయినా విజయ్ తన ధోరణి మార్చుకుంటే మంచిదే. పూరి జగన్నాధ్ ఎలాగో అనుభవజ్ఞుడు కనుక అక్కడ విజయ్ ఆటలు చెల్లకపోవచ్చు. ఏదేమైనా సూపర్ క్రేజ్ ని దండగ చేసుకుంటున్నాడని సోషల్ మీడియాలో విజయ్ గురించిన చర్చ జోరుగా సాగుతోంది. వరల్డ్ ఫేమస్ లవర్ కి కనీసం పది కోట్ల షేర్ కూడా మొదటి మూడు రోజుల్లో రాకపోవడం దీనికి ఊతమిచ్చింది.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English