చిరు అల్లుడికి ఇంత ఆశేంటో?

చిరు అల్లుడికి ఇంత ఆశేంటో?

ఇంత‌కుముందు హీరోల కొడుకులు.. లేదంటే వాళ్ల ర‌క్త సంబంధీకులు హీరోల‌య్యేవాళ్లు. కానీ ఇప్పుడు బ‌య‌టి కుటుంబం నుంచి వ‌చ్చి అల్లుడి మారిన వాళ్లు కూడా హీరోలు అయిపోతున్నారు. కృష్ణ అల్లుడు సుధీర్ బాబు లాంటి వాళ్లు అందుకు ఉదాహ‌ర‌ణ‌. అత‌ను కొంచెం త‌డ‌బ‌డుతూనే నిల‌దొక్కుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు.

సుధీర్ బాట‌లోనే మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ కూడా హీరోగా మారిన సంగ‌తి తెలిసిందే. అత‌ను క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మైన విజేత సినిమా ప్రేక్ష‌కుల‌కు రుచించ‌లేదు. ఆ సినిమా వ‌చ్చింది తెలియ‌దు. వెళ్లింది తెలియ‌దు. దీంతో ఈసారి కొంచెం గ్యాప్ తీసుకుని జాగ్ర‌త్త‌గా ఇంకో సినిమా చేస్తున్నాడు. అదే.. సూప‌ర్ మ‌చ్చి.

రిజ్వాన్ ఎంట‌ర్టైన్మెంట్స్ బేన‌ర్ మీద పులి వాసు అనే కొత్త ద‌ర్శ‌కుడితో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ సినిమా స‌న్నాఫ్ స‌త్య‌మూర్తిలోని పాపుల‌ర్ పాట‌లోని ప‌దాన్ని ఈ సినిమాకు టైటిల్‌గా పెట్టుకోవ‌డం ద్వారా ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేశాడు క‌ళ్యాణ్. ఈ సినిమా గురించి త‌ర్వాత ఏ అప్ డేట్ లేదు. ఐతే ఇప్పుడు బ‌య‌టికి వ‌చ్చిన స‌మాచారం చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

ఈ చిత్రాన్ని క‌న్న‌డ‌లో కూడా రిలీజ్ చేయ‌నున్నార‌ట. దీనికి అక్క‌డ మీనాక్షి అనే టైటిల్ కూడా ఖ‌రారు చేశారు. ఐతే క‌ళ్యాణ్ ఇంకా తెలుగులోనే ప్రేక్ష‌కుల ఆమోదం పొంద‌లేదు. త‌న‌కంటూ గుర్తింపు ఏమీ సాధించ‌లేదు. స‌క్సెస్ కాలేదు. ఇక్క‌డ ఇంకా బేస్ ఏర్పాటు కాక‌ముందే క‌న్న‌డ‌లోకి త‌న సినిమాను తీసుకెళ్ల‌డంలో ఆంత‌ర్య‌మేంటో అర్థం కావ‌డం లేదు. క‌ర్ణాట‌క‌లో చిరు స‌హా మెగా హీరోల‌కు మంచి మార్కెట్టే ఉంది కానీ.. అంత‌కంటే ఎక్కువ మార్కెట్ ఉన్న తెలుగు రాష్ట్రాల్లోనే క‌ళ్యాణ్ ఇంకా త‌నేంటో రుజువు చేసుకోలేదు క‌దా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English