అల్లూరిగా అదరగొడుతోన్న చరణ్‌

అల్లూరిగా అదరగొడుతోన్న చరణ్‌

అల్లూరి సీతారామరాజు యంగర్‌ వెర్షన్‌గా 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో కనిపించబోతున్న చరణ్‌పై రాజమౌళి ప్రస్తుతం కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు. అల్లూరి, కొమరం భీమ్‌లు యవ్వనంలో కొన్నేళ్ల పాటు కనిపించకుండా వెళ్లారు. ఆ సమయంలో వారు ఏమి చేసి వుంటారనే కల్పిత గాధతో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. చరణ్‌ కొన్నాళ్లు సైరా పనులతో బిజీ కావడంతో ఆ సమయంలో ఎన్టీఆర్‌పై సన్నివేశాలని చిత్రీకరించిన రాజమౌళి ఇప్పుడు చరణ్‌ సన్నివేశాలని తీస్తున్నాడు. అల్లూరిగా చరణ్‌ అదిరిపోయే అభినయాన్ని ప్రదర్శిస్తున్నాడని, చరణ్‌లో ఇంతవరకు చూడని కోణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నామని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది.

ఇద్దరు అగ్ర హీరోలతో సినిమా అంటే ఎవరికైనా కాస్త కంగారు వుంటుంది. కానీ వీరిద్దరి బలాబలాలు తెలియడం వలన రాజమౌళి వారికి అనుగుణమైన సన్నివేశాలతో ఎవరికీ కాస్త కూడా తగ్గని హీరోయిజం సెట్‌ చేసాడు. కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌ అద్భుతంగా నటిస్తున్నాడనేది చాలా కాలంగా వినిపిస్తోంది. చరణ్‌ కూడా ఎమోషనల్‌ సీన్స్‌ అదరగొడుతున్నాడట. రంగస్థలంతో నటుడిగా కాన్ఫిడెన్స్‌ సంపాదించిన చరణ్‌ ఇప్పుడు తొణుకు బెణుకు లేకుండా రాజమౌళి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌కి ప్రాణం పోస్తున్నాడట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English