సుక్కు ఒప్పుకుంటాడని ఎలా అనుకున్నారు?

సుక్కు ఒప్పుకుంటాడని ఎలా అనుకున్నారు?

తెలుగులో ఒరిజినల్ డైరెక్టర్స్ అనిపించేవాళ్లే చాలా తక్కువమంది. ఎక్కడా కథలు, సన్నివేశాలు, స్క్రీన్ ప్లే ఫార్మాట్లు, ఇతర ఐడియాలు కాపీ కొట్టకుండా తమకంటూ ఒక కొత్త శైలి ఏర్పరుచుకుని ఎప్పటికప్పుడు కొత్తగా ఆవిష్కరించుకుంటూ సాగిపోయే దర్శకులు కొద్ది మందే. వాళ్లలో సుకుమార్ ఒకడు.

సుక్కు కెరీర్లో హిట్లుండొచ్చు.. ఫ్లాపులుండొచ్చు.. కానీ ప్రతి సినిమాలో ఒరిజినాలిటీ, కొత్తదనం కనిపిస్తాయి. ఆయన ఎవరినీ అనుకరించడు. అనుసరించడు. తన ఐడియాల్ని వేరే వాళ్ల సాయంతో డెవలప్ చేస్తాడు. లేదా వేరే వాళ్ల ఐడియాల్ని తాను డెవలప్ చేస్తాడు. అంతే తప్ప మరో భాషలో తీసిన సినిమాను సుకుమార్ రీమేక్ చేయడం అన్నది ఇంత వరకు జరగలేదు. ఇకముందూ జరగకపోవచ్చు కూడా.

కానీ ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి కోసం రామ్ చరణ్ హక్కులు కొన్న మలయాళ సినిమా ‘లూసిఫర్’ను సుకుమార్ రీమేక్ చేయబోతున్నాడని విస్తృతంగా ప్రచారం జరిగింది. దీని గురించి వచ్చిన ఫాలో అప్ వార్తేంటంటే.. ఈ రీమేక్‌ను డైరెక్ట్ చేయడానికి సుక్కు నో చెప్పాడట. అసలు రామ్ చరణ్ అడిగాడా.. సుక్కు నో చెప్పాడా అన్నది వేరే విషయం.

అసలు సుక్కు ఒక రీమేక్ సినిమా తీస్తాడని ఎలా అనుకుంటాం. ఆయన మనస్తత్వానికి ఇది అస్సలు సూటవ్వని వ్యవహారం. ఈ సినిమా సుక్కు చేస్తాడని అనుకోవడమే కరెక్ట్ కాదు. ఒకవేళ రామ్ చరణ్ నిజంగా అడిగి ఉన్నా.. సుక్కు నో చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు.

అయినా సుకుమార్‌కు ఆల్రెడీ కమిట్మెంట్లయితే చాలానే ఉన్నాయి. ఆయనతో సినిమా చేయడానికి చాలామంది హీరోలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆయన దగ్గర ఐడియాలకూ కొదవలేదు. చిరునే సుక్కుతో చేస్తానంటే అద్భుతమైన సబ్జెక్టుతో వస్తాడు కానీ.. రీమేక్‌తో రాజీ పడే రకమైతే సుక్కు కాదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English