రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం హిందీలో మాత్రమే రిలీజైంది. వరల్డ్ వైడ్ ఏకంగా రూ.1400 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టింది. ఇండియా వరకే వసూళ్లు రూ.900 కోట్ల దాకా వచ్చాయి. ఒక భాషలో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీ ఇదే.
రిలీజ్ ముంగిట నెగెటివిటీని ఎదుర్కొన్న చిత్రం.. ఈ స్థాయిలో వసూళ్లు రాబడుతుందని ఎవ్వరూ అనుకోలేదు. ఇప్పుడీ చిత్రం నెట్ ఫ్లిక్స్ ద్వారా డిజిటల్‌గా రిలీజైంది. దీని గురించి పెద్దగా పబ్లిసిటీ లేకపోయినా.. స్ట్రీమింగ్‌లోకి వచ్చినప్పటి నుంచి అద్భుత స్పందన తెచ్చుకుంటోంది దురంధర్. డిజిటల్ క్వాలిటీ సరిగా లేదని, విజువల్‌గా అద్భుతంగా ఉన్న సినిమాను నెట్‌ప్లిక్స్ చెడగొట్టిందనే విమర్శల మధ్యే ఆ చిత్రానికి భారీగా వ్యూస్ వస్తున్నాయి. ఈ చిత్రం హిందీతో పాటుగా ప్రాంతీయ భాషల్లోనూ రిలీజ్ కాగా.. అన్నింట్లోకి తెలుగు నుంచి అదిరిపోయే స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది.
తెలుగు డబ్బింగ్ విషయంలో మేకర్స్ తీసుకున్న శ్రద్ధ.. డబ్బింగ్ టీం పెట్టిన ఎఫర్ట్స్ ప్రశంసలు అందుకుంటున్నాయి. దురంధర్ పాన్ ఇండియా మూవీ కాదు. వివిధ భాషల వాళ్లను మెప్పించాలన్నట్లుగా ఇందులో సీన్లు ఉండవు. పక్కా హిందీ మూవీలా ఉంటుంది. చాలా రియలిస్టిగ్గా తీశారు. ఇలాంటి సినిమాలను ఒరిజినల్ లాంగ్వేజ్‌లోనే చూడాలనిపిస్తుంది. డబ్బింగ్ చేసినా సరిగా కుదరదు. అథెంటిగ్గా అనిపించదు. ఏదో లోపించిన ఫీల్ కలుగుతుంది.
కానీ దురంధర్ విషయంలో అలాంటి ఫీడ్ బ్యాక్ రావట్లేదు. ఒరిజినల్ ఫీల్ మిస్ కానివ్వకుండా.. పర్ఫెక్ట్‌గా డైలాగులు రాశారు. అలాగే ఆయా పాత్రలకు సరిపోయేలా డబ్బింగ్ చెప్పించారు. పాటల వరకు హిందీవే ఉంచేశారు తప్ప.. మిగతా అంతా జాగ్రత్తగా వ్యవహరించారు.
దురంధర్ మిగతా డబ్బింగ్ వెర్షన్లతో పోలిస్తే తెలుగుదే పర్ఫెక్ట్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. తక్కువ అంచనాలతో తెలుగు డబ్బింగ్ వెర్షన్ చూసిన వాళ్లందరూ మంచి అనుభూతితో డబ్బింగ్ టీం పెట్టిన ఎఫర్ట్స్‌ను కొనియాడుతున్నారు. దీని వల్ల తెలుగులో రీచ్ పెరగడం.. దురంధర్-2కు బాగా ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు. ఆ చిత్రం ప్రాంతీయ భాషల్లో కూడా విడుదల కానుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates