చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ ‘జాతిరత్నాలు’ సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ పొడుగుకాళ్ల సుందరి, ఆ తర్వాత ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. మధ్యలో కొన్ని సినిమాలు చేసినా అవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో చిట్టి క్రేజ్ కాస్త తగ్గినట్లు అనిపించినా, సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలతో ఫ్యాన్స్‌ను పలకరిస్తూనే ఉంది.

రీసెంట్‌గా తిరువీర్ హీరోగా వస్తున్న ‘భగవంతుడు’ సినిమా టీజర్ విడుదలైంది. ఇందులో ఫరియా లుక్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. టీజర్ స్టార్టింగ్‌లో పక్కా పల్లెటూరి అమ్మాయిలా లంగా ఓణిలో కనిపిస్తూనే, మరోవైపు రొమాంటిక్ సీన్స్‌లో కాస్త గ్లామర్ డోస్ పెంచినట్లు అర్థమవుతోంది. అలాగే లిప్ లాక్ సీన్ కూడా హైలెట్ అయ్యింది. ట్రైలర్ చివరిలో గట్టిగా కేక వేసి రౌడీలను భయపెట్టిన ఒక షాట్ చూస్తుంటే చిట్టి రౌద్ర రూపం కూడా చూడోక్ చిట్టి ఇలాంటి బోల్డ్ రోల్‌లో కనిపించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

కంటెంట్ డిమాండ్ చేస్తే గ్లామరస్ రోల్స్ చేయడానికి తనేం వెనుకాడనని ఫరియా ఇదివరకే క్లారిటీ ఇచ్చింది. దానికి తగ్గట్టుగానే ఈ పీరియడ్ రూరల్ డ్రామాలో తన నటనతో పాటు గ్లామర్‌ను కూడా బ్యాలెన్స్ చేసినట్లు కనిపిస్తోంది. మరీ ఓవర్ అనిపించకుండా, కథకు తగ్గట్టుగానే తన పాత్రను డిజైన్ చేసినట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. జాతిరత్నాలు తర్వాత సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఫరియాకు ఈ సినిమా చాలా కీలకం. కేవలం గ్లామర్ మాత్రమే కాకుండా ఎమోషనల్ సీన్స్‌లోనూ మెప్పించే అవకాశం ఈ మూవీలో ఉన్నట్లు కనిపిస్తోంది. 

ఒకవైపు పల్లెటూరి అమాయకత్వం, మరోవైపు బోల్డ్ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఆమె ప్లాన్ చేసినట్లుంది. జిజి విహారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భగవంతుడు’ సినిమాతో ఫరియా మళ్లీ ఫామ్‌లోకి వస్తుందేమో చూడాలి. టీజర్‌తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా, ఆమె కెరీర్‌కు ప్లస్ అవుతుందో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. సోషల్ మీడియాలో తన ఫోటోలతో ఎట్రాక్ట్ చేసే చిట్టి, వెండితెరపై కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.