డైరెక్టర్ తేజ.. ఊరికే అయిపోరు మెగాస్టార్లు

డైరెక్టర్ తేజ.. ఊరికే అయిపోరు మెగాస్టార్లు

రెండు రోజుల కిందట సీనియర్ నటుడు ఉత్తేజ్ ఆధ్వర్యంలో నడిచే ఒక ఫిలిం ఇన్‌స్టిట్యూట్ తొలి బ్యాచ్‌కు సర్టిఫికెట్ల ప్రదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చాడు తేజ. ఈ సందర్భంగా సుదీర్ఘంగా 25 నిమిషాల పాటు మాట్లాడాడు. తనకు మాట్లాడ్డం రాదు అంటూనే అదిరిపోయే స్పీచ్ ఇచ్చాడు.

ఈ స్పీచ్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. వర్ధమాన నటులకే కాదు.. పెద్ద పెద్ద స్టార్లకు కూడా జ్ఞానోదయం అయ్యేలా ఎన్నో మంచి విషయాలు చెప్పాడు తేజ. అవన్నీ కూడా తేజ అనుభవాల నుంచి వచ్చినవే. పుస్తకాల్లోంచి ఎన్ని విషయాలు చెప్పినా జనాలకు ఎక్కదు కానీ.. అనుభవాల్నే పాఠాలుగా మార్చి చెబితే మాత్రం బాగా కనెక్ట్ అవుతారు. తేజ అదే చేశాడు.

అమితాబ్ బచ్చన్, చిరంజీవి, శివాజీ గణేషన్, ఆమిర్ ఖాన్ లాంటి గొప్ప నటులు ఎలా ఆ స్థాయికి చేరుకున్నారో తేజ అద్భుతమైన ఉదాహరణలతో చెప్పాడు. సెట్‌లోని ప్రతి విషయం గురించి వీళ్లకున్న అవగాహన, చిన్న చిన్న వ్యక్తుల నుంచి వీళ్లెలా మంచి విషయాలు నేర్చుకున్నారో ఆయన గొప్పగా వివరించాడు. తమ సన్నివేశం పూర్తవ్వగానే కారవాన్లలోకి వెళ్లిపోయే ఈ తరం స్టార్లందరికీ గట్టిగా చురక అంటించాడు.

సెట్‌లో ఉండి వేరే వాళ్ల నటనను గమనిస్తేనే నటులుగా ఎదగగలుగుతారంటూ.. అమితాబ్ ఒక సందర్భంలో ఒక బాయ్‌ను చూసి తన నటనను ఎలా మెరుగు పరుచుకున్నాడో వివరించాడు. ఆమిర్ ఖాన్ ఒక సందర్భంలో హీరోయిన్ చాలా ఇబ్బందికరంగా వ్యవహరించినా.. తనెలా కమిట్మెంట్ చూపించాడో వివరించాడు. ఇప్పుడు ‘దంగల్’ సినిమా చైనాలో 1000 కోట్లు వసూలు చేసిందంటే అందుకు ఆమిర్ యాటిట్యూడ్ కారణమన్నాడు.

చిరును ఉదాహరణగా చూపించి.. ఊరికే అయిపోరు మెగాస్టార్లు అంటూ ఒక చక్కటి ఉదాహరణ చెప్పాడు. ఈ తరం బిల్డప్ స్టార్లు చాలామంది తేజ మాటలు వింటే సిగ్గు పడేలా సాగింది ఆయన స్పీచ్. ఇక వర్ధమాన నటులైతే నేర్చుకోవడానికి చాలా విషయాలు చెప్పాడాయన. మొత్తానికి ఈ స్పీచ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. సోషల్ మీడియాలో కూడా దీని గురించి పెద్ద చర్చ నడుస్తోంది. ఒక కల్ట్ స్పీచ్‌గా ఇది నిలిచిపోవడం ఖాయం.
    

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English