సైరా’ను ఎత్తుకున్న‌ బాలీవుడ్

సైరా’ను ఎత్తుకున్న‌ బాలీవుడ్

ఒక భారీ సినిమా రిలీజ‌వుతుంటే.. ఎప్పుడు ఎక్క‌డ‌ తొలి షో ప‌డుతుంది.. టాక్ ఎప్పుడు బ‌య‌టికి వ‌స్తుంది అని అభిమానులు అత్యంత ఉత్సాహంతో ఎదురు చూస్తారు. మామూలుగా రిలీజ్ ముందు రోజు అర్ధ‌రాత్రి దాటాక‌ యుఎస్ నుంచి ఫ‌స్ట్ టాక్ బ‌య‌టికి వ‌స్తుంది. అయితే లేటెస్ట్ రిలీజ్ ‘సైరా నరసింహారెడ్డి’కి మాత్రం ముందు రోజు రాత్రి 10 గంటల ప్రాంతంలోనే టాక్ బయటికి వచ్చేసింది. ఇందుక్కారణం. రాత్రి 7 గంటల ప్రాంతంలో ముంబయిలో బాలీవుడ్ సెలబ్రెటీస్‌కి, ప్రెస్ వాళ్లకు స్పెషల్ షో వేయడమే.

సినిమా ఇంటర్వెల్ కార్డ్ పడే సమయం నుంచే ఫీడ్ బ్యాక్ బయటికి రావడం మొదలైంది. ఇక షో అయిన కొన్ని నిమిషాల నుంచి షార్ట్ రివ్యూలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. కొన్ని గంటల్లో టాక్ స్ప్రెడ్ అయింది. సినిమా చూసిన వాళ్లంతా మరో మాట లేకుండా ‘సైరా’ అద్భుతం అనేశారు.

సినిమా అంతా గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయని.. సినిమా చూసి ప్రతి భారతీయుడూ గర్విస్తాడని ముంబయి మీడియా సర్కిల్స్‌ నుంచి ఉమ్మడి అభిప్రాయం వ్యక్తమైంది. చిరంజీవి ఈ వయసులో పడ్డ కష్టాన్ని, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్‌, ఇంటెన్సిటీ, ఎనర్జీని పొగిడేశారు. యుద్ధ సన్నివేశాల గురించి కూడా కొనియాడారు. యాక్షన్ పార్ట్ మొత్తం అద్భుతం అని అన్నారు. ప్రతి విభాగం గురించి పాజిటివ్‌గా మాట్లాడారు.

ఉద‌యం హిందీ వెర్ష‌న్ రివ్యూలు కూడా చాలా పాజిటివ్‌గా వ‌చ్చాయి. తెలుగులో కంటే కూడా హిందీలో టాక్ బాగుండ‌టం, పాజిటివ్ రివ్యూలు రావ‌డం విశేష‌మే. బాలీవుడ్ నుంచి ఎలాంటి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ లేకపోవడం ‘సైరా’ టీంకు ఉత్సాహాన్నిచ్చేదే. ఈ టాక్‌తో ‘సైరా’ హిందీలో ఏ రేంజికి వెళ్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English