రిజెక్టెడ్‌ స్టోరీతో విజయ్‌ దేవరకొండ?

రిజెక్టెడ్‌ స్టోరీతో విజయ్‌ దేవరకొండ?

పూరి జగన్నాథ్‌తో విజయ్‌ దేవరకొండ సినిమా రాత్రికి రాత్రి ఓకే అయిపోయింది. అంతవరకు పూరితో చేయాలా, వద్దా అని డౌట్‌ పడిన విజయ్‌ 'డియర్‌ కామ్రేడ్‌' ఫ్లాప్‌ అయ్యాక షేక్‌ అయ్యాడు. తనకిప్పుడు మాస్‌ ఆడియన్స్‌ యాక్సెప్టెన్స్‌ కావాలని, 'ఇస్మార్ట్‌ శంకర్‌'తో బ్లాక్‌బస్టర్‌ ఇచ్చిన పూరితో ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పాడు. ఇంతకీ పూరి అప్పటికప్పుడు విజయ్‌కి వినిపించిన కథ ఏంటి? అది చాలా పాత కథేనట. పూరి దగ్గర చాలా కాలంగా వున్న కథే అది. దానిని పలువురు హీరోలు వినడం, తిరస్కరించడం కూడా జరిగింది. పూరి అదే కథని కొందరు నిర్మాతలకి కూడా వినిపించినా ఎవరూ ఆసక్తి చూపించలేదట. ఆ కథనే విజయ్‌ దేవరకొండ సింగిల్‌ సిట్టింగ్‌లో ఓకే చేసాడు.

పూరి దగ్గర పూర్తి లైన్‌ కూడా లేదని, ఒక పావుగంట మాత్రమే నెరేషన్‌ ఇచ్చి ఓకే చేయించుకున్నాడని తెలిసింది. మరి విజయ్‌ దేవరకొండకి ఆ కథ నిజంగానే నచ్చిందో, లేక పూరి కథలన్నీ అలాగే వుంటాయి కాబట్టి వర్కవుట్‌ అయిపోతుందిలెమ్మని ఓకే చేసేసాడో అతనికే తెలియాలి. ఇండస్ట్రీలో మాత్రం అన్నేళ్లుగా అన్ని సార్లు రిజెక్ట్‌ అయిన కథని అంత సింపుల్‌గా ఎలా ఓకే చేసేసాడనే డిస్కషన్‌ బాగానే జరుగుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English