నాన్-బాహుబ‌లి గ్యారెంటీ.. బాహుబ‌లి డౌట్‌

నాన్-బాహుబ‌లి గ్యారెంటీ.. బాహుబ‌లి డౌట్‌

టాక్ ఎలా ఉన్న‌ప్ప‌టికీ సాహో తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌భంజ‌నం సృష్టించేలాగే ఉంది. దాదాపుగా అన్ని సెంట‌ర్ల‌లోనూ సినిమాకు ఫుల్స్ ప‌డిపోయాయి. రెండు రాష్ట్రాల్లోనూ టికెట్ల రేట్లు పెంచారు. పైగా ఏపీ అద‌నపు షోలు కూడా ప‌డ్డాయి. కాబ‌ట్టి వసూళ్ల‌లో కొత్త‌ రికార్డులు న‌మోదు కావడం లాంఛ‌న‌మే అని భావిస్తున్నారు.

తొలి రోజుకు ఏ ఏరియాలో కూడా నాన్-బాహుబ‌లి రికార్డులు మిగిలేలా లేవు. తెలంగాణ‌లో ఈ చిత్రం బాహుబ‌లి: ది కంక్లూజ‌న్ పేరిట ఉన్న తొలి రోజు వ‌సూళ్ల రికార్డును కూడా దాటేసినా ఆశ్చ‌ర్యం లేద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఆ సినిమా ఫ‌స్ట్ డే తెలంగాణ వ్యాప్తంగా రూ.8.92 కోట్ల షేర్ సాధించి సంచ‌ల‌నం సృష్టించింది. ఈ రికార్డు ఇప్పుడిప్పుడే బ‌ద్ద‌లు కాద‌నుకున్నారు.

కానీ సాహో దానికి చేరువగా వెళ్లేలా ఉంది. రికార్డు బ‌ద్ద‌లైనా ఆశ్చ‌ర్యం లేదు. సాహో శుక్ర‌వారం మినిమం రూ.8 కోట్ల షేర్ రాబ‌డుతుంద‌ని అంచనా వేస్తున్నారు. టాక్‌తో సంబంధం లేకుండా ఫ‌స్ట్ షో, సెకండ్ షోలకు ఫుల్స్ ప‌డ్డ నేప‌థ్యంలో రూ.9 కోట్ల మార్కును కూడా దాటేసినా దాటేస్తుందేమో. నైజాంలో తొలి రోజు నాన్-బాహుబ‌లి రికార్డు మ‌హ‌ర్షి పేరిట ఉంది.

ఆ చిత్రం రూ.6.41 కోట్ల‌తో రికార్డు నెల‌కొల్పింది. దాన్ని అల‌వోక‌గా సాహో దాటేసి ఉంటుంద‌ని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సాహో తొలి రోజు రూ.30 కోట్ల‌కు త‌క్కువ కాకుండా షేర్ రాబ‌ట్టే అవ‌కాశం ఉంది. ఐతే బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మాత్రం ఈ చిత్రం చాలా దూరం ప్ర‌యాణించాల్సి ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English