సైరాకి అంత సీన్‌ ఇవ్వట్లేదు

సైరాకి అంత సీన్‌ ఇవ్వట్లేదు

సాహో బాటలో వెళ్లిపోతూ తెలుగు రాష్ట్రాలకి అవతల క్రేజ్‌ తెచ్చుకోవాలని సైరా కోసం ముంబయి వెళ్లి చరణ్‌, చిరంజీవి ఇద్దరూ ఇంటర్వ్యూలు ఇచ్చి, మీడియాతో ముచ్చటించి, వారికి గిఫ్టులు గట్రా పంచిపెట్టి వచ్చారు. సైరాకి హిందీలో మంచి డిస్ట్రిబ్యూటర్‌ని అయితే పట్టగలిగారు కానీ అక్కడి వారు దీనిని సీరియస్‌గా తీసుకునేలా చేయలేకపోయారు.

అక్టోబర్‌ 2న సైరా రిలీజ్‌ అవడం ఖాయమయింది కనుక బాలీవుడ్‌లో ఇది సైడ్‌లైన్‌ అయిపోవడం ఖాయమంటున్నారు. ఎందుకంటే అదే రోజున హృతిక్‌, టైగర్‌ ష్రాఫ్‌ కలిసి నటించిన యాక్షన్‌ సినిమా వార్‌ రిలీజ్‌ అవుతోంది. అమితాబ్‌ ఒక్కరు వున్నంత మాత్రాన సైరాకి అక్కడ సేలబులిటీ రాదు. అలాగే తమిళం, మలయాళంలో కూడా సైరాకి సోలో రిలీజ్‌ దొరకడం లేదు.

కేవలం తెలుగు రాష్ట్రాలలో మాత్రమే సైరాకి పోటీ వుండదు. సాహోకి ఇచ్చినట్టుగా మిగతా వాళ్లు సైరాకి వెయిట్‌ ఇవ్వడం లేదు. దీంతో సైరా బడ్జెట్‌ రికవరీలో తొంభై శాతం తెలుగు వెర్షన్‌నుంచే జరగాలి. భారీగా ఖర్చు పెట్టేసిన చరణ్‌ ఇతర రాష్ట్రాల నుంచి రెవెన్యూ బాగుంటుందని ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాడు కానీ పరభాషా చిత్రాలతో ఏర్పడే పోటీని తట్టుకోవడం సైరాకి తలకి మించిన భారమవుతుంది.

అయితే మిగిలిన రాష్ట్రాలలో కూడా ఈ చిత్రానికి మాగ్జిమం ఆకర్షణ రాబట్టేలా ప్రణాళిక అయితే వేసుకున్నారు కానీ సాహో చిత్రానికి అక్కడ ఘన విజయం దక్కితే సాహో పని సులువవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English