ఛీఛీ.. శ్రీదేవి చావుని క్యాష్‌ చేసుకుంటారా?

ఛీఛీ.. శ్రీదేవి చావుని క్యాష్‌ చేసుకుంటారా?

శ్రీదేవిది సహజ మరణం కాదని, ఆమె అలా బాత్‌టబ్‌లో పడి మరణించడం వెనుక మిస్టరీ ఏదో దాగి వుందనే అనుమానాలు ఇప్పటికీ వ్యక్తమవుతుంటాయి. పలువురు తారల మరణాల్లో ఇలాంటి ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి. శ్రీదేవి కూడా అలాంటి అనుమానాలని వదిలేసే తనువు చాలించింది. అయితే ప్రజల్లో వున్న అనుమానాల ఆధారంగా 'శ్రీదేవి బంగ్లా' అనే చిత్రం ఒకటి రూపొందుతోంది.

'వింక్‌ గాళ్‌' ప్రియా ప్రకాష్‌ వారియర్‌ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న 'శ్రీదేవి బంగ్లా' చిత్రంలో కథానాయిక పాత్ర శ్రీదేవిని పోలి వుంది. ఆ సినిమా టీజర్‌లో లాస్ట్‌ షాట్‌ అయితే బాత్‌ టబ్‌లో పడి మరణించిందనే హింట్‌ ఇచ్చింది. ఇది అచ్చంగా శ్రీదేవి కథతోనే రూపొందుతోందనే సంగతి అప్పుడే బయట పడింది. ఈ చిత్రానికి పేరు మార్చనిదే విడుదల చేయనివ్వరాదని శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ లీగల్‌గా ప్రొసీడ్‌ అయ్యారు.

ఇలా మరొకరి చావుని క్యాష్‌ చేసుకోవాలనే చీప్‌ ప్రయత్నాలు ఎలా చేస్తారో అర్థం కావడం లేదని, ఇందులో నటించే వారికి, దీనికి పనిచేసే వారికి కనీస విలువలు కూడా లేవా అని బోనీ కపూర్‌ ప్రశ్నించారు. పేరు మార్చే వరకు ఈ చిత్రం రిలీజ్‌ కాకుండా ఆపడానికి కృషి చేస్తానని చెప్పారు.

బహుశా ఈ చిత్ర రూపకర్తలు కూడా ఈ సినిమా పూర్తిగా జనంలో రిజిష్టర్‌ అయ్యే వరకు టైటిల్‌ మార్చే పని పెట్టుకోరు. గతంలో రాంగోపాల్‌వర్మ ఒక బి గ్రేడ్‌ సినిమాకి శ్రీదేవి అనే పేరు పెడితే అతనిపై శ్రీదేవి స్వయంగా కేసు పెట్టి ఆ సినిమాని అడ్డుకుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English