సాహో దెబ్బకి ఆ సినిమా షెడ్డుకి!

సాహో దెబ్బకి ఆ సినిమా షెడ్డుకి!

బాలీవుడ్‌లో 'ధూమ్‌' ఫ్రాంచైజీకి వున్న క్రేజే వేరు. మొదటి సినిమాలో దొంగగా జాన్‌ అబ్రహాం నటించగా, రెండవ దాంట్లో హృతిక్‌ నటించాడు. మూడవసారి అమీర్‌ ఖాన్‌ చోరావతారం ఎత్తాడు. ప్రతి సినిమా ముందు దాని కంటే పెద్ద విజయాన్ని అందుకుంది. దీంతో ధూమ్‌ 4ని ఇంకా ఘనంగా తీయాలని కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అభిషేక్‌బచ్చన్‌, ఉదయ్‌ చోప్రాల పాత్రలని యువతరం నటులతో రీప్లేస్‌ చేసి ఈ ఫ్రాంచైజీని రీవాంప్‌ చేయాలని యష్‌రాజ్‌ ఫిలింస్‌ ప్రయత్నాలలో వుంది. అయితే సాహో ట్రెయిలర్‌ చూసిన తర్వాత ఆ ఐడియా ప్రస్తుతానికి డ్రాప్‌ అయింది.

సాహోతో విజువల్‌గా మరో లెవల్‌కి ఇండియన్‌ సినిమా చేరనుందని, అలాగే యాక్షన్‌ స్టంట్స్‌ కూడా ధూమ్‌ సిరీస్‌ని కొలమానంగా చేసుకుని తీస్తే కుదరదని యష్‌రాజ్‌ రియలైజ్‌ అయింది. అందుకే ప్రస్తుతానికి ధూమ్‌ని పక్కన పెట్టి సాహో బాక్సాఫీస్‌ పర్‌ఫార్మెన్స్‌ని బట్టి ఎంతలో తీయాలి, ఎలా తీయాలి, ఎవరితో తీయాలనే దానిపై ఒక నిర్ణయం తీసుకోవాలని డిసైడ్‌ అయింది. మొత్తానికి సాహో ఇటు తెలుగు చిత్ర స్థాయిని పెంచడమే కాకుండా అటు బాలీవుడ్‌ మేకర్స్‌కి ముచ్చెమటలు పట్టిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English