అమల మళ్ళీ ప్రేమలో పడింది

అమల మళ్ళీ ప్రేమలో పడింది

దర్శకుడు ఏ.ఎల్‌. విజయ్‌ని ప్రేమించి పెళ్లాడిన అమలా పాల్‌ రెండేళ్లు తిరగకుండా అతడినుంచి విడాకులు తీసుకుంది. ఆమె మాజీ భర్త విజయ్‌ ఇటీవలే ఒక డాక్టర్‌ని పెళ్లి చేసుకున్నాడు. అమలా పాల్‌ కూడా మరో వ్యక్తితో ప్రేమలో పడింది. ఈ విషయాన్ని మీడియాతో ఆమె స్వయంగా చెప్పింది. ఈసారి ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని కాకుండా సినీ పరిశ్రమతో సంబంధం లేని వ్యక్తిని అమల ఎంచుకుంది. అయితే ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని, ఇంకా నటిగా మరింత పేరు తెచ్చుకున్న తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తానని చెప్పింది.

ఇదిలావుంటే ఇటీవలే ఆమె నగ్నంగా నటించిన ఆడై టీజర్‌ రిలీజ్‌ అయి సంచలనం సృష్టించింది. ఆ టీజర్‌తో తమిళంలోనే కాకుండా దానికి తెలుగు అనువాదమైన ఆమె బిజినెస్‌ కూడా బ్రహ్మాండంగా జరిగిపోయింది. న్యూడ్‌ సీన్‌కి వస్తోన్న ప్రచారాన్ని అమల హ్యాపీగా స్వీకరిస్తోంది. ఆ సన్నివేశంలో న్యూడ్‌గా కనిపించడం చాలా కీలకమని, అలా నటించడం వల్లే ఆ సీన్‌ అంత బాగా వచ్చిందని, సినిమాలో ఆ దృశ్యం చూస్తే అశ్లీలంగానో, అసభ్యంగానో అనిపించదని, హీరోయిన్‌ పాత్రపై అమితమైన జాలి కలుగుతుందని, అంచేత సినిమా విడుదలయ్యాక ఆ సన్నివేశం చూసిన తర్వాత తమని జడ్జ్‌ చేయాలే కానీ చీప్‌ ట్రిక్స్‌గా ఇప్పుడే తీసి పారేయవద్దని ఆమె మీడియాకి విన్నవించుకుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English