మోత మోగిస్తున్న ‘అర్జున్ రెడ్డి’ ట్రైలర్

మోత మోగిస్తున్న ‘అర్జున్ రెడ్డి’ ట్రైలర్

ఎప్పుడో రెండేళ్ల ముందు రిలీజైన సినిమా ట్రైలర్ ఇప్పుడు మోత మోగించడం ఏంటి అనిపిస్తోందా? అదే చిత్రం మరి. ‘అర్జున్ రెడ్డి’ హిందీ వెర్షన్ ‘కబీర్ సింగ్’ దేశవ్యాప్తంగా భారీ వసూళ్లతో సాగిపోతున్న సంగతి తెలిసిందే. కొన్ని వివాదాలు కూడా ఈ సినిమాకు కలిసొచ్చి సినిమాకు అనూహ్యమైన ఆదరణ లభిస్తోంది.

కొన్ని వారాలుగా ‘కబీర్ సింగ్’ చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో దీని ఒరిజినల్ ‘అర్జున్ రెడ్డి’ మీద కూడా ఉత్తరాది జనాలు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. యూట్యూబ్‌లో దానికి సంబంధించిన వీడియోలన్నీ వెతికి వెతికి చూస్తున్నారు. ముఖ్యంగా దీని ట్రైలర్‌కు ఒక్కసారిగా భారీగా వ్యూస్ పెరిగాయి. మొత్తంగా ‘అర్జున్ రెడ్డి’ ట్రైలర్ వ్యూస్ 4 కోట్ల మార్కుకు చేరువగా వెళ్లడం విశేషం.

కొన్ని రోజుల ముందు వరకు నాన్-బాహుబలి ట్రైలర్ వ్యూస్ రికార్డు ‘వినయ విధేయ రామ’ పేరిట ఉండేది. దానికి 3 కోట్ల దాకా వ్యూస్ వచ్చాయి. కానీ దాని కంటే దిగువన ‘అర్జున్ రెడ్డి’ ట్రైలర్‌కు గత కొన్ని రోజుల్లోనే వ్యూస్ భారీగా పెరిగాయి. అది ‘వినయ విధేయ రామ’ ట్రైలర్ వ్యూస్‌ను దాటేసి కొత్త రికార్డుల దిశగా సాగుతోంది.
అమేజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా చూసేందుకు కూడా ఉత్తరాది ప్రేక్షకులు అమితాసక్తి ప్రదర్శిస్తున్నారు. అక్కడ వ్యూస్ లెక్క బయటికి రాదు కానీ.. ఒక కొత్త సినిమా స్థాయిలో స్పందన అద్భుతంగా ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తానికి ‘కబీర్ సింగ్’ పుణ్యమా అని ‘అర్జున్ రెడ్డి’పై మళ్లీ ప్రేక్షకుల్లో ఇంత ఆసక్తి కనిపిస్తుండటం ఆశ్చర్యమే. ‘కబీర్ సింగ్’ రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్ల దిశగా అడుగులు వేస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English