అతను సాహోని అస్సలు లెక్క చేయట్లేదు

అతను సాహోని అస్సలు లెక్క చేయట్లేదు

బాలీవుడ్‌లో తెలుగు వాళ్ల డామినేషన్‌ని అక్కడి స్టార్లు అంగీకరించలేకపోతున్నారు. బాహుబలి 2 రిలీజ్‌ అయి హిందీ రికార్డులన్నీ తిరగరాసినపుడు కూడా ఆ చిత్రాన్ని చూసి ఒక కామెంట్‌ పెట్టడానికి ముగ్గురు ఖాన్‌లకి మనసు రాలేదు. ఖాన్‌లనే కాదు చాలా మంది బాలీవుడ్‌ ప్రముఖ హీరోలు బాహుబలి గురించి తమకి తెలియనట్టే ప్రవర్తించారు.

తాజాగా జాన్‌ అబ్రహాం కూడా ఆగస్ట్‌ 15 పోటీలో వున్న సాహో తనకి అసలు కౌంట్‌లోకి రాదన్నట్టు మాట్లాడాడు. అదే రోజున విడుదలవుతోన్న తన బత్లా హౌస్‌ చిత్రంతో పాటు అక్షయ్‌కుమార్‌ సినిమా మిషన్‌ మంగళ్‌ మాత్రమే పోటీలో వున్నట్టుగా అతను మీడియాతో చెప్పాడు. అదే రోజున సాహో భారీ స్థాయిలో హిందీలో కూడా రిలీజ్‌ అవుతున్నా కానీ దానిని అతను లెక్క చేయలేదు.

పోటీ రెండు సినిమాల మధ్య వుందని, ఏది బాగుంటే దానిని ప్రేక్షకులు ఆదరిస్తారని, రెండూ బాగుండాలని కోరుకుంటున్నానని చెప్పాడు. సాహో గురించి మాట మాత్రమైనా జాన్‌ అబ్రహాం మాట్లాడలేదు. పట్టుమని యాభై కోట్ల మార్కెట్‌ కూడా లేని జాన్‌ లాంటి హీరోనే ఈ రేంజ్‌లో బడాయి పోతే ఇక బాలీవుడ్‌ సూపర్‌స్టార్లు మన వాళ్ల సినిమాలని పట్టించుకోకపోవడంలో వింతేమీ లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English