పవన్‌కళ్యాణ్‌ గురించి అంతా బుస్‌

పవన్‌కళ్యాణ్‌ గురించి అంతా బుస్‌

పవన్‌కళ్యాణ్‌ రీసెంట్‌గా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిని పర్సనల్‌గా కలిసి రావడంతో అతను ఆ పార్టీలో టీడీపీ తరఫున మచిలీపట్నం నుంచి పోటీ చేస్తాడని వదంతులు పుట్టుకొచ్చాయి. అయితే సినిమా ఇండస్ట్రీలో, ప్రత్యేకించి పవన్‌ సన్నిహితుల్లో ఎవరూ వీటిని నమ్మడం లేదు. పవన్‌కళ్యాణ్‌కి ప్రజారాజ్యంతోనే రాజకీయాలపై ఆసక్తి పోయిందని, ఎప్పుడయితే తమ పార్టీ ఓడిపోయిందో అప్పుడే అతను రాజకీయాలని త్యజించాడని, అందుకే ఆ తర్వాత ఒక్కసారి కూడా వాటి ఊసెత్తలేదని గుర్తు చేస్తున్నారు.

చిరంజీవి ఇప్పుడు కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషిస్తుండగా, అభిమానుల్ని నొప్పించేలా... అన్నయ్యని బాధించేలా పవన్‌ వెళ్లి మరో పార్టీలో చేరడని ఢంకా భజాయిస్తున్నారు. అన్నయ్యతో తనకెన్ని మనస్పర్ధలు వచ్చినా కానీ ఎప్పుడూ పబ్లిగ్గా వాటి గురించి పవన్‌ మాట్లాడలేదు. అలాంటిది ఇప్పుడు డైరెక్టుగా ఇంత పని చేస్తాడని అనుకోనవసరం లేదని, ఇదంతా కేవలం గ్యాస్‌ న్యూస్‌ అనీ కొట్టి పారేస్తున్నారు. పవన్‌ గురించి వార్త అయినా, వదంతి అయినా తన నుంచి ఎలాంటి క్లారిఫికేషన్‌ రాదు కాబట్టి ఎన్నికల వరకు మీడియా ఈ పాయింట్‌తో అడపాదడపా పండగ చేసుకుంటూ ఉండొచ్చు.  చేరుతున్నాడని, వచ్చే ఎన్నికల్లో

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు