హిట్టయితేనే డబ్బులిస్తానని నాగార్జున కండిషన్‌!

హిట్టయితేనే డబ్బులిస్తానని నాగార్జున కండిషన్‌!

అన్నపూర్ణ స్టూడియోస్‌ కాంపౌండ్‌లో వరుసగా రెండు సినిమాలు తీసి, విజయం సాధించిన దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ ఆ తర్వాత నాగార్జున నీడలోంచి బయటకి రావాలని చూసాడు. 'నేల టిక్కెట్టు' అనే సినిమా తీసి అంతకుముందు తీసిన రెండు సినిమాలతో వచ్చిన పేరు చెడగొట్టుకున్నాడు. నేల టిక్కెట్టు డిజాస్టర్‌ అయిన తర్వాత కళ్యాణ్‌కృష్ణకి అవకాశాలు రాలేదు. దాంతో తిరిగి అన్నపూర్ణ గూటిలో చేరిపోయాడు. అప్పుడు చేద్దామని అనుకున్న 'సోగ్గాడే చిన్నినాయనా' సీక్వెల్‌ 'బంగార్రాజు'కి దుమ్ము దులిపారు. ఈ చిత్రంలో నాగార్జున, నాగచైతన్య ఇద్దరూ కలిసి నటిస్తున్నారు.

'సోగ్గాడే'లో కొడుక్కి రొమాన్స్‌లో ట్రిక్కులు నేర్పించే బంగార్రాజు ఈసారి మనవడిని దారిలో పెట్టడానికి ఘోస్ట్‌లా వస్తాడట. అదే కాన్సెప్ట్‌ మీద స్టోరీ అల్లుతున్నారు. ఆ రెండు హిట్ల తర్వాత అక్కడే వుంటే దర్శకుడు కళ్యాణ్‌కృష్ణకి ఇప్పుడు అన్నపూర్ణ కాంపౌండ్‌లో బాగా వెయిట్‌ వుండేది. కానీ నేల టిక్కెట్టుతో నేల మీదకి వచ్చేసిన ఆ దర్శకుడికి ఇప్పుడు ఫిక్స్‌డ్‌ రెమ్యూనరేషన్‌ లేదట. కేవలం ఎక్స్‌పెన్సస్‌ మాత్రమే ఇస్తున్నారట. సినిమాని హిట్‌ చేస్తే కనుక ప్రాఫిట్‌లో షేర్‌ ఇస్తానని నాగ్‌ చెప్పాడని, దానికి ఒప్పుకునే కళ్యాణ్‌కృష్ణ ఈ సినిమా చేస్తున్నాడని సమాచారం.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English