‘అర్జున్ రెడ్డి’ని వాళ్లూ నాశనం చేయబోతున్నారా?

  ‘అర్జున్ రెడ్డి’ని వాళ్లూ నాశనం చేయబోతున్నారా?

ఒక భాషలో ఓ సినిమా క్లాసిక్, కల్ట్ అనిపించుకున్నంత మాత్రాన మరో భాషలో అదే స్థాయిని అందుకుంటుందన్న గ్యారెంటీ ఏమీ లేదు. మాతృకలోని సోల్‌ను పట్టుకోకుంటే, ఫీల్‌ను క్యారీ చేయకుంటే దారుణమైన ఫలితాలు వస్తుంటాయి కొన్నిసార్లు. రెండేళ్ల కిందట తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని హిందీలో సందీప్ రెడ్డి వంగానే రీమేక్ చేశాడు. అక్కడ ఆ చిత్రం అద్భుతమైన ఫలితం రాబట్టింది. భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది.

కానీ తమిళంలో ఇదే చిత్రాన్ని రీమేక్ చేస్తే అక్కడ విపరీతమైన నెగెటివిటీ కనిపిస్తోంది. ఒకసారి తీసి పక్కన పడేసి.. మళ్లీ సినిమా తీసినా ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన లేదు. ఈ చిత్రానికి ధ్రువ్ విక్రమ్ మిస్ ఫిట్ అయ్యాాడు. ఇంకొన్ని కారణాలు కూడా తోడై ఈ చిత్రం విడుదలకు ముందే డిజాస్టర్ ఫీలింగ్ కలిగించేసింది.

ఐతే ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ పరంపర ఏమీ ఆగట్లేదు. దీన్ని బెంగాలీలో కూడా రీమేక్ చేస్తున్నారు. తాజాగా కన్నడ రీమేక్ అనౌన్స్ చేశారు. ఐతే తెలుగు, తమిళ చిత్రాల్ని కన్నడిగులు రీమేక్ చేయడం కొత్తేమీ కాదు. కానీ వాళ్లు సరైన కసరత్తు చేయరు. ఆయా సినిమాలకు సూటయ్యే హీరోల్ని ఎంచుకోరు. తమిళంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘96’ సినిమాను ఆల్రెడీ అక్కడ ‘99’ పేరుతో రీమేక్ చేశారు. ఆ సినిమా అమేజాన్‌లో ఉంది. అది చూస్తే బెంబేలెత్తడం ఖాయం. ఆ క్లాసిక్‌ను ఎంతగా చెడగొట్టాలో అంతగా చెడగొట్టేశారనిపిస్తుంది.

ఇలా కన్నడలోకి వెళ్లి పాడైపోయిన సినిమాలకు లెక్కే లేదు. కాస్టింగ్ దగ్గరే అక్కడ తేడా కొట్టేస్తుంటుంది. ‘అర్జున్ రెడ్డి’ సినిమా సంగతి తెలిసి కన్నడిగులు దీన్ని రీమేక్ చేస్తుంటారని తెలియగానే తెలుగు జనాలకు ఆందోళన కలుగుతోంది. తమిళ వెర్షన్ తరహాలోనే ఇది కూడా తేడా కొట్టడం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు. ఆ చిత్రానికి ఇంకా హీరో, దర్శకుడు ఖరారవ్వకముందే ఈ అభిప్రాయాలు వ్యక్తమవుతుండటం గమనార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English