జన్మనిచ్చిన ఆయనే.. పునర్జన్మ ఇవ్వాలి

జన్మనిచ్చిన ఆయనే.. పునర్జన్మ ఇవ్వాలి

‘ప్రేమమ్’ సినిమాతో కథానాయికగా అరంగేట్రంలోనే బలమైన ముద్ర వేసింది సాయిపల్లవి. ఆ సినిమా చూడకుండా సాయిపల్లవిని చూసిన వాళ్లు ఏముంది ఈమెలో ప్రత్యేకత అనుకున్నారు. తెలుగు వాళ్లు కూడా చాలామందికి అదే అభిప్రాయం కలిగి ఉండొచ్చు. కానీ ‘ఫిదా’ చూశాక అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి.

ఒక మలయాళ అమ్మాయి.. తెలంగాణ యాస మీద పట్టు సాధించి.. ఇక్కడి గ్రామీణ అమ్మాయిగా మెప్పించిన తీరుకు ఎవ్వరైనా ఫిదా అయిపోవాల్సిందే. ఈ సినిమాతో ఒక్కసారిగా తెలుగులో ఎనలేని గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది సాయిపల్లవి. కేవలం ఆమె కోసమే సినిమాకు వెళ్లే లక్షలమంది అభిమానులు తెలుగులో తయారయ్యారు. కానీ ‘ఫిదా’ తర్వాత సాయిపల్లవి టాలెంటుని సరిగ్గా ఉపయోగించుకున్న సినిమా ఒక్కటీ తెలుగులో రాలేదు.

‘ఎంసీఏ’ హిట్టయి ఉండొచ్చు కానీ.. అది సాయిపల్లవి అభిమానుల్ని నిరాశ పరిచింది. డబ్బింగ్ సినిమాలు ‘కణం’, ‘మారి-2’ సంగతి చెప్పాల్సిన పని లేదు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ‘పడి పడి లేచె మనసు’ మామూలుగా డిజప్పాయింట్ చేయలేదు. మొత్తానికి ‘ఫిదా’తో వచ్చిందంతా.. తర్వాతి సినిమాలతో పోయింది. ఇప్పుడు సాయిపల్లవి ఒక మామూలు హీరోయిన్ అయిపోయింది. ఇలాంటి సమయంలో ఆమెకు శేఖర్ కమ్ముల మళ్లీ అవకాశం ఇస్తున్నాడని వార్తలొస్తున్నాయి.

నాగచైతన్యతో ఆయన అనౌన్స్ చేసిన కొత్త సినిమాలో సాయిపల్లవే కథానాయిక అట. ఈ కాంబినేషన్ ఎంత ఆసక్తి రేకెత్తిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కమ్ములతో మళ్లీ సాయిపల్లవి అనగానే ఎగ్జైట్మెంట్ కలుగుతోంది. మరి సాయిపల్లవికి తెలుగు సినిమాల్లో జన్మనిచ్చిన ఆయనే.. మళ్లీ ఆమెకు పునర్జన్మ ఇస్తాడేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English