మహర్షి పోస్టర్లు ఆపేస్తే బెటరేమో

మహర్షి పోస్టర్లు ఆపేస్తే బెటరేమో

ఒక ప్రక్కనేమో సినిమా యావరేజ్ గా ఉందనే విషయం అందరికీ తెలిసిందే. మరో ప్రక్కనేమో ధియేటర్లు సగం కూడా నిండట్లేదు. ఏదో సమ్మర్ చలవంటూ కాస్త గాట్టిగానే కలక్షన్లు వచ్చేశాయి కాని.. టీమ్ 'మహర్షి' మాత్రం తమ పబ్లిసిటీ భజనను అస్సుల ఆపేట్లు కనిపించట్లేదు. మొన్న వారు రిలీజ్ చేసిన '175+ కోట్లు గ్రాస్ కలక్షన్ వసూలు' పోస్టర్ ఏదైతే ఉందో, అది మాత్రం మామూలు టూమచ్ అంటున్నారు నెటిజన్లు.

ఒకప్పుడు సినిమా హిట్టయ్యి ఆడుతుంటే.. 1వ వారం, 2వ వారం, 4వ వారం, 50 రోజులు.. అంటూ పోస్టర్లు పడేవి. ఇప్పుడు మాత్రం 50 కోట్లు, 100 కోట్లు అంటూ పోస్టర్లు వేస్తున్నారు. దానర్దం, చాలామంది ఆల్రెడీ మాకు డబ్బులు ఇచ్చేశారు, మీరు కనుక ఇవ్వకపోతే త్వరగా దయచేయండి అన్నట్లుంది. ఇక మహర్షి విషయానికొస్తే, వడ్డించేవాడు మనోడైత రెండు స్వీట్లు ఎక్కువేపడతాయ్ అనే సామెత తరహాలో, డిజైనర్ మనోడైతే కావల్సిన నెంబర్లు పోస్టర్ల మీద వేసుకోవచ్చు అన్నట్లుంది యవ్వారం. పైగా బాక్సీఫీస్ ట్రాకర్స్ అందరూ మహర్షి కలక్షన్ల గురించి నోరు మెదపకపోవడం, నిర్మాతలు మాత్రం ఫిగర్లు మీద ఫిగర్లు రిలీజ్ చేస్తుండటంతో, ఈ పోస్టర్లలోని నెంబర్లు నిజమేనని నమ్మబుద్దికావట్లేదు.

ఎలాగో సినిమా అంత పెద్ద హిట్ అయ్యిందనుకున్నప్పుడు, ఇక నెంబర్ల గురించి చెప్పి చర్చలకు తెరలేపాల్సిన అవసరం లేదు. పైగా చాలా చోట్ల బయ్యర్లు నష్టపోయారనే టాక్ వినిపిస్తున్నప్పుడు, సినిమా నిర్మాతలకు మాత్రం కోట్లు కోట్లు వచ్చేశాయని చెబితే అస్సలు బాగోదు. ఏమంటావ్ మహర్షి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English