విక్రమ్‌కు ఈ పిచ్చి వ‌ద‌ల‌దా?

విక్రమ్‌కు ఈ పిచ్చి వ‌ద‌ల‌దా?

ఏదైనా ఒక‌సారికి కొత్త‌గా అనిపించే విష‌యం మ‌ళ్లీ మ‌ళ్లీ చూస్తే మొహం మొత్తేస్తుంది. తెలుగు సినిమాలు చిన్న చిన్న పాత్ర‌లు చేసి ఆపై త‌మిళంలో న‌టుడిగా గొప్ప పేరు సంపాదించి, తిరుగులేని ఇమేజ్ కూడా సంపాదించుకున్న విక్ర‌మ్ సంగ‌తి ఈ కోవ‌లోనిదే. అత‌డికి వేషాలు మార్చ‌డ‌మంటే మ‌హా స‌ర‌దా. సేతు, అప‌రిచితుడు, పితామ‌గ‌న్.. ఇలా చాలా సినిమాల్లో విక్రమ్ విచిత్ర‌మైన వేషాల్లో క‌నిపించాడు. ఐతే మొద‌ట్లో అత‌డి విచిత్ర వేషాలు కొత్త‌గా అనిపించాయి కానీ.. త‌ర్వాత త‌ర్వాత ఇవే రిపీట్ చేస్తుండ‌టంతో జ‌నాల‌కు విసుగొచ్చింది. ర‌క‌ర‌కాల మేక‌ప్‌లు వేసుకుని, శ‌రీరాన్ని క‌ష్ట‌పెట్టుకుని వేషాలు మార్చి ఇంప్రెస్ చేయాల‌ని చూశాడు త‌ప్ప స‌రైన క‌థ‌లు ఎంచుకోలేదు. ఐ, ఇంకొక్క‌డు లాంటి సినిమాలు ఫ్లాప్ కావ‌డానికి అదే కార‌ణం.

ఐతే వ‌రుస‌గా ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్న‌ప్ప‌టికీ విక్ర‌మ్‌లో పెద్ద‌గా మార్పు వ‌చ్చిన‌ట్లు లేదు. మ‌ళ్లీ అత‌డికి ఈ వేషాలు మార్చే మోజు పుట్టిన‌ట్లుంది. తాజాగా విక్రమ్ హీరోగా ఓ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. డిమాంటి కాల‌నీ, ఇమైక్క నోడిగ‌ల్ (తెలుగులో అంజ‌లి ఐపీఎస్) లాంటి డిఫ‌రెంట్ మూవీస్ తీసిన అజ‌య్ జ్నాన‌ముత్తు డైరెక్ట్ చేస్తున్న మూవీ ఇది. దీని ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్లో ర‌క‌ర‌క‌కాల అవ‌తారాల్లో క‌నిపించాడు విక్ర‌మ్. ఎప్ప‌ట్లాగే మేక‌ప్‌తో మ్యాజిక్ చేయ‌బోతున్నాడ‌న్న‌మాట‌. అజ‌య్ టాలెంటెడ్ డైరెక్ట‌రే కానీ.. ఇంత‌కుముందు విక్ర‌మ్‌తో జ‌త క‌ట్టిన చాలామంది ద‌ర్శ‌కులు అత‌డి వేషాల మోజుతో ఇలాగే త‌ప్పుబ‌ట్టారు. *ఇరుముగ‌న్* అనే కొత్త త‌ర‌హా సినిమా తీసిన ఆనంద్ శంక‌ర్ త‌ర్వాత *ఇంకొక్కుడు* చిత్రంతో బోల్తా కొట్టాడు. ఫ‌స్ట్ లుక్ చూశాక‌ అజ‌య్ కూడా అలా త‌ప్పుదోవ ప‌ట్టాడేమో అన్న డౌట్లు కొడుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English