ఆల్రెడీ దేవీనే ఫిక్సయ్యాడు.. ఇక మారుస్తాడా?

ఆల్రెడీ దేవీనే ఫిక్సయ్యాడు.. ఇక మారుస్తాడా?

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ల్యాండ్ మార్క్ ఫిలిం ‘మహర్షి’. హీరోగా అతడికిది 25వ చిత్రం అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మూడేళ్ల ముందే సన్నాహాలు మొదలయ్యాయి. దర్శకుడు వంశీ పైడిపల్లి స్క్రిప్టు దశలోనే దేవిశ్రీ ప్రసాద్‌తో సంగీత చర్చలు కూడా మొదలుపెట్టాడు. అంత ముందుగా, అది కూడా అమెరికాలో మ్యూజిక్ సిట్టింగ్స్ జరిగాయంటే పాటలు ఓ రేంజిలో ఉంటాయని అభిమానులు ఆశించారు. కానీ దేవి అంచనాల్ని అందుకోలేకపోయాడు. రెండు మూడు పాటలు మినహాయిస్తే ‘మహర్షి’ ఆడియో చాలా వరకు నిరాశ పరిచింది. ఛోటీ ఛోటీ.. నువ్వే సమస్తం.. ఎవరెస్ట్ అంచున.. పాలపిట్ట పాటలు చాలా సాధారణంగా అనిపించాయి. దీంతో మహేష్ అభిమానులే దేవి పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు. నేపథ్య సంగీతం కూడా అంత గొప్పగా ఏమీ లేదు.

మహేష్ సిల్వర్ జూబ్లీ సినిమాకు ఇలాంటి పాటలు ఇవ్వడంతో మండిపోయిన మహేష్ ఫ్యాన్స్ ఇకపై దేవితో పని చేయొద్దంటూ సోషల్ మీడియాలో ఉద్యమం నడుపుతుండటం గమనార్హం. మహేష్ తన తర్వాతి సినిమాను అనిల్ రావిపూడితో చేస్తున్న సంగతి తెలిసిందే. అతడి ‘ఎఫ్-2’ చిత్రానికి దేవీనే మ్యూజిక్ ఇచ్చాడు. దానికీ ఔట్ పుట్ ఏమంత గొప్పగా రాలేదు. అయినా అనిల్ మాత్రం మహేష్ సినిమాకు దేవీనే ఫిక్స్ చేసి పెట్టుకున్నాడు. కథ రాయడం మొదలు పెట్టగానే దేవిని కన్ఫమ్ చేశాడట. నిర్మాతలు, మహేష్ కూడా ఓకే అన్నట్లు తెలుస్తోంది. కానీ మహేష్ ఫ్యాన్సేమో.. దేవి వద్దు, తమన్‌ లేదా మరో మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకోండంటూ అదే పనిగా అనిల్‌కు ట్విట్టర్లో మెసేజ్‌లు పెడుతున్నారు. మరి అతను తన నిర్ణయాన్ని మార్చుకుంటాడా అన్నది సందేహమే. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన రానున్న నేపథ్యంలో ఆ రోజే ఏ విషయం తేలనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English