అటు చేసి, ఇటు చేసి వరుణ్‌తేజ్‌ని దెబ్బ కొట్టారు

అటు చేసి, ఇటు చేసి వరుణ్‌తేజ్‌ని దెబ్బ కొట్టారు

వరుణ్‌ తేజ్‌ తొలిసారిగా నెగెటివ్‌ క్యారెక్టర్‌ చేస్తోన్న వాల్మీకికి అడిషినల్‌ క్రేజ్‌ కోసం పూజా హెగ్డేతో ఒక స్పెషల్‌ రోల్‌ చేయించాలని అనుకున్నారు. వరుణ్‌తో గతంలో ముకుంద చిత్రంలో కలిసి నటించిన పూజ అతని కోసం ఈ పాత్ర చేయడానికి ఒప్పుకుంది. హరీష్‌ శంకర్‌తో డిజె చేసింది కనుక ఆ పరిచయం కూడా కలిసి వచ్చింది. కానీ ఈ చిత్రంలో పూజ నటించడాన్ని మీడియా రచ్చ చేసింది. చిన్న సినిమాలకి పారితోషికం ఎక్కువ డిమాండ్‌ చేస్తోందంటూ వార్తల్లో నిలబెట్టింది.

అదే సమయంలో పూజ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిందనే మరో రూమర్‌ కూడా స్ప్రెడ్‌ అయింది. స్టార్‌ హీరోయిన్‌గా ఎదుగుతోన్న దశలో తనపై ఇలాంటి రూమర్స్‌ పుట్టుకు రావడంతో ఇక పెద్ద సినిమాలకే కట్టుబడాలని పూజ డిసైడ్‌ అయింది. చిన్న సినిమాల్లో నటిస్తే తనపై మనీ మైండెడ్‌ అనే ముద్ర వేసేస్తున్నారని వాల్మీకి నుంచి తప్పుకుంది. పూజకి బదులు మరో హీరోయిన్‌ని వెతుక్కునే పడ్డాడు వాల్మీకి. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టుగా పూజపై పుట్టించిన పుకార్లు కాస్తా వాల్మీకిని ఇబ్బందుల్లోకి నెట్టాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English