ఎవెంజర్స్ మోత.. ఒక్క రోజులో 750 కోట్లు

ఎవెంజర్స్ మోత.. ఒక్క రోజులో 750 కోట్లు

ఎవెంజర్స్.. ఎవెంజర్స్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల చర్చలన్నీ దీని చుట్టూనే తిరుగుతున్నాయి. ‘ఎవెంజర్స్’ సిరీస్‌లో భాగంగా ఈ శుక్రవారం విడుదల కాబోతున్న ‘ది ఎండ్ గేమ్’ బుకింగ్స్ పరంగా ఎలాంటి సంచలనాలు రేపుతోందో వింటూనే ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఓపెనింగ్ రికార్డులనూ ఈ చిత్రం బద్దలు కొట్టేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓవరాల్ వసూళ్ల రికార్డులు కూడా బద్దలయ్యేలాగే కనిపిస్తున్నాయి. ఐతే వరల్డ్ వైడ్ శుక్రవారం రిలీజ్ కావాల్సిన ఈ చిత్రాన్ని కొన్ని ఆసియా దేశాల్లో రెండు రోజుల ముందే రిలీజ్ చేశారు. చైనాలో ఈ చిత్రాన్ని కనీ వినీ ఎరుగని స్థాయిలో రిలీజ్ చేయగా.. తొలి రోజు వసూళ్ల మోత మోగించేసింది. ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ పండిట్లను విస్మయానికి గురి చేస్తూ ఏకంగా అక్కడ తొలి రోజు రూ.750 కోట్ల వసూళ్లు కొల్లగొట్టి సంచలనం రేపింది.

ఇప్పటిదాకా చైనాలో ఏ సినిమా కూడా ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. చైనాలో దేశవ్యాప్తంగా లక్షకు పైగా థియేటర్లున్నాయి. ఈ చిత్రాన్ని దాదాపు సగం థియేటర్లలో రిలీజ్ చేశారు. అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడటంతో ఊహించని స్థాయిలో వసూళ్లు వచ్చాయి. ఒక్క చైనాలోనే ఒక్క రోజులో రూ.750 కోట్లు వచ్చాయంటే ఇక ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజవుతున్న ఈ చిత్రం ఫుల్ రన్లో ఎంత వసూలు చేస్తుందో అంచనా వేయొచ్చు. ఈ లెక్కన చూస్తే ‘అవతార్’ పేరిట ఉన్న ఓవరాల్ వసూళ్ల రికార్డు బద్దలు కావడం లాంఛనమే కావచ్చు. ఆ సినిమా ఫుల్ రన్లో 2.7 బిలియన్ డాలర్లు (దాదాపు 18.8 వేల కోట్లు) వసూలు చేసింది. ‘ఎవెంజర్స్’ ఈ వసూళ్లను దాటేసి ప్రపంచ సినీ చరిత్రలో 3 బిలియన్ డాలర్ల కలెక్షన్లు రాబట్టిన తొలి సినిమాగా రికార్డు నెలకొల్పుతుందని అంచనా వేస్తున్నారు. ఇండియాలో ఈ సినిమాకు జరుగుతున్న బుకింగ్స్ చూస్తే అలవోకగా రూ.500 కోట్ల గ్రాస్ మార్కును అందుకునేలా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English