రాహుల్ గాంధీ బయోపిక్.. ఆ నటుడి షాకింగ్ కామెంట్

రాహుల్ గాంధీ బయోపిక్.. ఆ నటుడి షాకింగ్ కామెంట్

నరేంద్ర మోడీ జీవిత కథ ఆధారంగా తెరకెెక్కిన ‘పీఎం నరేంద్ర మోడీ’ సినిమాలో కథానాయకుడిగా నటించిన బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్.. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ మీద సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓ ఆంగ్ల మీడియా ఛానల్‌ నిర్వహించిన చర్చాకార్యక్రమంలో వివేక్‌ పాల్గొన్నాడు. ఇప్పుడు మోడీ బయోపిక్‌లో నటించారు కదా.. మరి త్వరలో రాహుల్‌ బయోపిక్‌ కూడా తీస్తారా?’ అని విలేకరి అడిగిన ప్రశ్నకు వివేక్‌ స్పందిస్తూ.. ‘‘ఆయనేం సాధించారని బయోపిక్‌ తీయాలి? ఒకవేళ సినిమా తీస్తే చిత్రీకరణ మొత్తం థాయ్‌లాండ్‌లోనే జరపాల్సి ఉంటుంది’ అన్నాడు.

థాయిలాండ్ షూటింగ్ అనడంలో పెద్ద సెటైరే ఉంది. రాహుల్ గాంధీ అమ్మాయిల కోసం తరచుగా విదేశాలకు.. ముఖ్యంగా థాయిలాండ్‌కు వెళ్తుంటాడని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారు. దాన్ని దృష్టిలో ఉంచుకునే వివేక్ ఈ కామెంట్ చేశాడన్నది స్పష్టం. దీనిపై సామాజిక మాధ్యమాల్లో దుమారం రేగింది. కొందరు వివేక్ భలే కౌంటర్ వేశాడని పొగిడితే.. కాంగ్రెస్ మద్దతుదారులు అతడిని తీవ్రంగా దూషించారు. కాంగ్రెస్ పార్టీ ఈ కామెంట్ మీద స్పందించింది. ‘‘వివేక్‌ ఏదో గొప్ప సినిమా చేశానని ఫీలైపోతున్నారు. ఆయన ఓ ఫ్లాప్‌ హీరో. ఫ్లాప్‌ నిర్మాతతో కలిసి తీసిన బోగస్‌ సినిమా’’ అంటూ మోడీ సినిమాతో పాటు వివేక్ తీరును దుయ్యబట్టింది కాంగ్రెస్ పార్టీ.

ఐతే కాంగ్రెస్ వాళ్లపై వివేక్ మళ్లీ ఎదురు దాడి చేశాడు. వాళ్లు ఓవరాక్షన్ చేస్తున్నారని.. తామేమీ మోడీని సూపర్ హీరోలా చూపించలేదని.. ఒక స్ఫూర్తిమంతమైన వ్యక్తి కథను వాస్తవిక కోణంలో చూపించామని అతనన్నాడు. ఎన్నికలకు ముందు ఈ సినిమా విడుదలను ఆపాలనడం మూర్ఖత్వమని.. వారికి సినిమా పట్ల భయమో లేక, చౌకీదార్‌ పట్ల భయమో తనకు అర్థంకావడం లేదని.. సినిమా ఎప్పుడు విడుదల చేయాలన్నది తమ ఇష్టమని చెప్పాడు. ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English