అల్లు అర్జున్‌ నాట్‌ శాటిస్‌ఫైడ్‌!

అల్లు అర్జున్‌ నాట్‌ శాటిస్‌ఫైడ్‌!

ప్రతి వేసవికి తన సినిమా ఒకటి విడుదలయ్యేలా చూసుకునే అల్లు అర్జున్‌ దాదాపు పది నెలలుగా ఖాళీగా వున్నాడు. ఇంతవరకు అతని కొత్త సినిమా షూటింగ్‌ మొదలు కాలేదు. అక్టోబర్‌లోనే త్రివిక్రమ్‌తో తదుపరి చిత్రం చేయాలని డిసైడ్‌ అయినా కానీ ఇంతవరకు ఆ చిత్రం మొదలవలేదు.

'నా పేరు సూర్య' ఫ్లాప్‌ అవడం, అంతకుముందు చేసిన చిత్రాలు అంతంత మాత్రంగా ఆడడంతో అల్లు అర్జున్‌ ఈ చిత్రం విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాడు. త్రివిక్రమ్‌కి కూడా ఇటీవల ఎదురు దెబ్బలు తగలడంతో అతని బ్రాండ్‌ నేమ్‌ని గ్రాంటెడ్‌గా తీసుకోవడం లేదు.

ఆల్రెడీ కథ ఓకే అయిపోయినా కానీ సెకండ్‌ హాఫ్‌లో కొన్ని కీలక మార్పులని బన్నీ చెప్పాడట. అయితే త్రివిక్రమ్‌ మాత్రం ఆ సన్నివేశాలతో కన్విన్స్‌ అయిపోయాడట. దాంతో ఈ చిత్రం కోసం లుక్‌ మారుస్తానంటూ అల్లు అర్జున్‌ షూటింగ్‌ వాయిదా వేయించాడట. తాను లుక్‌ మార్చుకుని వచ్చేలోగా మరోసారి సెకండ్‌ హాఫ్‌ని రీరైట్‌ చేయమని కోరాడట.

త్రివిక్రమ్‌కి కథపై ఎక్కువ సమయం గడపడం అలవాటు లేదు. ఎన్ని సార్లు చెక్కినా ఇంతే వుంటుందనే తీరు. కానీ అల్లు అర్జున్‌ మాత్రం అలా సర్దుకుపోవడానికి సిద్ధంగా లేడు. అసలే అగ్ర హీరోల మధ్య పోటీ పెరిగిన నేపథ్యంలో అల్లు అర్జున్‌ ఛాన్స్‌ తీసుకోవడానికి ససేమీరా అంటున్నాడు. దీంతో ఈ చిత్రం ఇంతవరకు ముందుకి కదల్లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English