ఆర్‌ఎక్స్‌ పోరీ గురించి జస్ట్‌ రూమరే

ఆర్‌ఎక్స్‌ పోరీ గురించి జస్ట్‌ రూమరే

మొదటి సినిమాతోనే సంచలనం చేసిన పాయల్‌ రాజ్‌పుట్‌కి 'ఆర్‌ ఎక్స్‌ 100' తర్వాత ఇంతవరకు సరయిన అవకాశం రాలేదు. ఆ తరహా పాత్ర పోషించిన హీరోయిన్‌కి తర్వాత రెగ్యులర్‌ క్యారెక్టర్స్‌ రావడం కష్టమే. యువ హీరోలతో అవకాశాలు రాకపోవడంతో వెటరన్‌ హీరోలతో నటించడానికి సిద్ధపడుతోందంటూ పాయల్‌ గురించి కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. నాగార్జునతో 'మన్మథుడు 2'లో పాయల్‌ ఒక కథానాయికగా నటిస్తోందనే ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో అది ఒట్టిదేనని తేలిపోయింది.

పాయల్‌ రాజ్‌పుట్‌ని వాళ్లెవరూ సంప్రదించలేదట. మరి వెంకీమామలో వెంకటేష్‌కి జోడీగా నటిస్తోందనే న్యూస్‌లో అయినా వాస్తవం వుందో లేదో మరి. ఆర్‌ఎక్స్‌ 100 బ్లాక్‌బస్టర్‌ అయినా కానీ అది యూత్‌, మాస్‌కి నచ్చిన కల్ట్‌ సినిమా అవడంతో ఆ చిత్ర నటీనటవర్గం, దర్శకుడు ఎవరూ కూడా సంచలనం కాలేకపోయారు. ఆ చిత్ర కథానాయకుడు కూడా ఇప్పుడు నాని సినిమాలో సైడ్‌ క్యారెక్టర్‌ చేసేస్తున్నాడు. ఆ చిత్ర దర్శకుడు అజయ్‌ భూపతి కొందరు స్టార్‌ హీరోల కోసం ప్రయత్నించి తన రెండవ చిత్రాన్ని బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఓకే చేసుకున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English