ఫైనల్ గా రష్మిక కనిపించింది

ఫైనల్ గా రష్మిక కనిపించింది

గీతా గోవిందం బ్యుటి రష్మిక మందనా కన్నడలో కనబడటం లేదని ఇటీవల టాక్ బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడూ లేని విధంగా కన్నడ ఇండస్ట్రీను బేబీ పట్టించుకోవడం లేదని కొన్ని కథనాలు కూడా వెలువడ్డాయి. అక్కడ బడా నిర్మాతలు  మేడమ్ గారిని పట్టించుకోవడం లేదని కామెంట్స్ రావడంతో ఇటీవల అమ్మడు ఏ విధంగా స్పందించిందో అందరికి తెలిసిందే.

తనకు ఆన్సర్ కావాలంటూ గట్టిగానే స్పందించిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఓ ట్రైలర్ లో సరికొత్తగా కనిపించింది. కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ హీరోగా యజమాన అనే కమర్షియల్ సినిమా తెరకెక్కింది. అందుకు సంబంధించిన కమర్షియల్ ట్రైలర్ ను కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేయడంతో రష్మిక ఈజ్ బ్యాక్ అంటూ ఆమె అభిమానులు సంబరపడిపోతున్నారు. మొత్తానికి కన్నడ సినిమాల్లో రష్మిక కనబడటం లేదని ఏడుస్తున్న ఫ్యాన్స్ కోసమే ట్రైలర్ వచ్చిందని చెప్పాలి. ఎన్ని విమర్శలు వచ్చినా కూడా మేడమ్ గారు సైలెంట్ గా ఇలా ట్రైలర్ తో తన కౌంటర్ ను ఇచ్చేసింది.

తెలుగుతో పాటు అన్ని ఇండస్ట్రీలల్లో సినిమాలను కవర్ చేస్తూ కెరీర్ ను ఒక రేంజ్ లో సెట్ చేసుకుంటోంది. ఇక్కడ డియర్ కామ్రెడ్ సినిమాతో పాటు.. అమ్మడు అల్లు అర్జున్ అండ్ త్రివిక్రమ్ సినిమాలో కూడా అమ్మడు హీరోయిన్ గా మెరిసే ఛాన్సుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English