వైఎస్‌పై అభిమానం 14 కోట్లు తెస్తుందా?

వైఎస్‌పై అభిమానం 14 కోట్లు తెస్తుందా?

టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డల్లుగా నడుస్తోందిప్పుడు. కొత్త ఏడాది మొదలై ఐదు వారాలు దాటిపోగా.. ఒక్క ‘ఎఫ్-2‘ మాత్రమే హిట్టయింది. సంక్రాంతి సీజన్‌కు ముందు, వెనుక వారాల్లో కొత్త సినిమాలేవీ రాలేదు. ‘మిస్టర్’ మజ్ను వచ్చాక కూడా ఒక వారం గ్యాప్ వచ్చింది. ఈ వారం ‘యాత్ర’ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితంలో ప్రధాన ఘట్టమైన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది.

ఎన్టీఆర్ మీద తీసిన సినిమాకే బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితం వచ్చిన నేపథ్యంలో వైఎస్ సినిమా మీద పెద్దగా అంచనాలు లేవు. ముందు నుంచి దీనికి బజ్ తక్కువగానే ఉంది. ఐతే సినిమాను తక్కువ బడ్జెట్లో తెరకెక్కించి.. బిజినెస్ కూడా దానికి తగ్గట్లే చేసుకున్నారు. ఈ చిత్రం రూ.13.5 కోట్లు రాబడితే బ్రేక్ ఈవెన్‌కు వచ్చేస్తుంది.

కానీ మలయాళ స్టార్ మమ్ముట్టి నటించిన ఈ చిత్రంపై తెలుగు ప్రేక్షకులు ఏమేరకు ఆసక్తి ప్రదర్శిస్తారో చూడాలి. వైఎస్ మీద జనాల్లో ఇంకా ఏ స్థాయిలో అభిమానం ఎలాంటిదనడానికి ఈ సినిమా పరీక్షగా నిలవనుంది. సాధారణ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎగబడే అవకాశాలు లేవు. వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు దారులు.. వైఎస్, జగన్ అభిమానులు పెద్ద ఎత్తున సినిమా చూస్తారని.. కాబట్టి సినిమా కమర్షియల్‌గా మరీ తీసి పోయే స్థాయిలో ఏమీ ఆడదని భావిస్తున్నారు.

‘యాత్ర‘ నైజాం హక్కుల థియేట్రికల్ వాల్యూ రూ.3.3 కోట్లు కాగా.. వైకాపాకు పట్టున్న రాయలసీమలో ఈ చిత్ర హక్కుల్ని రూ.2.2 కోట్లకు అమ్మారు. ఆంధ్రాలో అన్ని ఏరియాలూ కలిపి రూ.5.5 కోట్లు పలికాయి. ఓవర్సీస్ హక్కులు రూ.2 కోట్లుగా అంచనా వేస్తున్నారు. మిగతా ఏరియాల ద్వారా రూ.40 లక్షలు వచ్చాయి. మొత్తంగా వైఎస్ సినిమా రూ.13.4 కోట్లకు బిజినెస్ చేసింది. మరి రూ.14 కోట్లు వెనక్కి తెచ్చే సత్తా వైఎస్ సినిమాకు ఉందో లేదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English