ఒక్క సినిమా టికెట్.. రూ.4.37 ల‌క్ష‌లు

ఒక్క సినిమా టికెట్.. రూ.4.37 ల‌క్ష‌లు

పెద్ద హీరోల సినిమాలు రిలీజ‌వుతున్న‌పుడు బెనిఫిట్ షోల‌కు టికెట్ల రేట్లు పెంచి అమ్ముతుంటారు. క్రేజును బ‌ట్టి రేటుంటుంది. అలాగే కొన్ని స్పెష‌ల్ షోల‌కు తొలి టికెట్‌ను వేలం వేయ‌డం.. అభిమానులు ఒక‌రిని మించి ఒక‌రు వేలం పాట పాడి.. భారీ ధ‌ర‌కు టికెట్‌ను కొన‌డ‌మూ మామూలే.

ఎక్కువ మెగా, నంద‌మూరి హీరోల సినిమాల‌కు ఇలాంటి వేలం పాట‌లు న‌డుస్తుంటాయి. ఎంత పోటీ ప‌డ్డా కూడా తొలి టికెట్ రేటు వేల‌ల్లోనే ఉంటుంది. కానీ దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవితంలో ముఖ్య ఘ‌ట్ట‌మైన పాద‌యాత్ర ఆధారంగా తెర‌కెక్కిన 'యాత్ర‌' సినిమా తొలి టికెట్ ఏకంగా రూ.4.37 ల‌క్ష‌లు ప‌ల‌క‌డం విశేషం.

అమెరికాలోని సీటెల్‌లో ప్రిమియ‌ర్ షో తొలి టికెట్‌ను వేలం వేయ‌గా.. వైఎస్ అభిమానులు, వైకాపా మ‌ద్ద‌తు దారులు దాని కోసం పోటీ ప‌డ్డారు. మునీశ్వ‌ర్ రెడ్డి అనే వైఎస్ వీరాభిమాని ఏకంగా రూ.4.37 ల‌క్ష‌ల ధ‌ర పెట్టి టికెట్‌ను సొంతం చేసుకున్నాడు. మామూలుగా స్టార్ హీరోల సినిమాల‌కే ఇలాంటి క్రేజ్ క‌నిపిస్తుంటుంది. ఐతే ఎన్నిక‌ల దగ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో వైఎస్ క్రేజ్ ఎలాంటిదో చూపించాల‌ని చేశాడో.. వార్త‌ల్లో నిల‌వ‌డం కోసం చేశాడో కానీ.. ఆయ‌న అభిమాని భారీ ధ‌రకు టికెట్ సొంతం చేసుకున్నాడు..

'ఆనందో బ్ర‌హ్మ‌'తో స‌త్తా చాటిన మ‌హి.వి.రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం 'యాత్ర‌'. మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి ఇందులో వైఎస్ పాత్ర‌ను పోషించాడు. అలాంటి లెజెండ‌రీ యాక్ట‌ర్ వైఎస్ పాత్ర‌ను చేయ‌డమే ఈ చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. 'యాత్ర‌' టీజ‌ర్, ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల్ని బాగానే ఆక‌ట్టుకున్నాయి. ఐతే 'య‌న్.టి.ఆర్' మీద తీసిన సినిమా చూడ్డానికే ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రాని నేప‌థ్యంలో 'యాత్ర‌' ఏమాత్రం వారి దృష్టిని ఆక‌ర్షిస్తుంద‌న్న‌దే సందేహం. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 8న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 7న అమెరికాలో ప్రిమియ‌ర్లు ప‌డ‌నున్నాయి.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English