తమన్నా హెల్త్ ని లెక్క చేయట్లేదే..

తమన్నా హెల్త్ ని లెక్క చేయట్లేదే..

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇప్పట్లో రెస్ట్ తీసుకొనేలా లేదు. మూడు పదుల వయసు దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా తన ఎనర్జీని పెంచుకుంటోంది. ఓ వైపు కుర్ర హీరోలతో నటిస్తూనే అవసరమైతే సీనియర్ హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఇకపోతే ఈ మధ్య సినిమా షూటింగ్స్ లో బిజీగా పాల్గొంటూ సినిమా ప్రమోషన్ లకు కూడా తీరిక లేకుండా హాజరవుతోంది.

ఈ మధ్యకాలంలో కన్నె కలైమన్నే - F2 సినిమాలతో తమన్నా బిజీ బిజీగా గడిపింది. అయితే అమ్మడి బిజీ షెడ్యూల్ కారణంగా ఫిజికల్ అండ్ మెంటల్ గా చాలా వరకు అలసిపోయినట్లు ఆమె సన్నిహితుల ద్వారా ఇటీవల తెలిసింది. దీంతో తప్పనిసరిగా హాస్పిటల్ కి వెళ్లాల్సిన సమయంలో డుమ్మా కొట్టేసినట్లు టాక్. తీవ్రమైన ఒత్తిడితో బాధపడుతున్నట్లు మరియు వారం రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స చేయాలని కుటుంబ సభ్యులు కూడా సూచించారట.

డాక్టర్ ని సంప్రదించడం కోసం ఒక డేట్ కూడా సెట్ చేసుకున్నారు. కానీ సినిమాలకు సంబంధించిన పనుల వల్ల తమన్నా తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయలేదు. ప్రమోషన్ - షూటింగ్స్ అంటూ బిజీ షెడ్యూల్ లో పడి ట్రీట్మెంట్ ని పక్కన పెట్టేసిందట. అంటే ఈ బహుబలి బ్యూటీకి ఎంత కష్టపడే తత్వమో అర్ధమవుతోంది. ఇక ప్రస్తుతం తమన్నా ధట్ ఈజ్ మహాలక్ష్మి - సైరా సినిమాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English