బోయపాటిది రాంగ్ టైమింగ్ అబ్బా..

బోయపాటిది రాంగ్ టైమింగ్ అబ్బా..

మామూలుగా ఒక సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నపుడు హీరోతో పాటు దర్శకుడి పేరు మార్మోగుతుంది. కానీ ‘వినయ విధేయ రామ’ సినిమా పూర్తిగా నెగెటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ దర్శకుడు బోయపాటి శ్రీను హాట్ టాపిక్ అవుతున్నాడు. శుక్రవారం ఉదయం తొలి షో పడ్డప్పటి నుంచి సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా బోయపాటి గురించే చర్చ. ఇందులో పిచ్చి పిచ్చిగా ఉన్న కొన్ని సీన్ల మీద సోషల్ మీడియాలో ఓ రేంజిలో ట్రోలింగ్ నడుస్తోంది. లాజిక్‌లతో బోయపాటి ఎలా రఫ్ఫాడుకున్నాడో చెబుతూ జోకులు పేలుస్తున్నారు. ‘వినయ విధేయ రామ’ గురించి ప్రి రిలీజ్ ఈవెంట్లో అతను చెప్పిన మాటల్ని గుర్తు చేసి సెటైర్లు గుప్పిస్తున్నారు. ఇలాంటి టైంలో అతను చేసిన ఒక అనౌన్స్‌మెంట్ తేడా కొట్టింది.

తాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక సినిమా చేయబోతున్నట్లుగా ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో బోయపాటి వెల్లడించాడు. తమ ఇద్దరి కాంబినేషన్లో సినిమా కోసం ఎప్పట్నుంచో చర్చలు జరుగుతున్నాయని.. త్వరలోనే ఆ సినిమా ఉంటుందని ప్రకటించాడు బోయపాటి. పనిలో పనిగా మెగాస్టార్ చిరంజీవితో కూడా తాను ఒక సినిమా చేస్తానని అన్నాడు. ఐతే ‘వినయ విధేయ రామ’ విషయంలో తీవ్ర విమర్శలు, సెటైర్లు ఎదుర్కొంటున్న సమయంలో ఈ ప్రకటనలు రావడం తేడా కొట్టింది.

‘రంగస్థలం’ లాంటి మరపు రాని విజయం తర్వాత రామ్ చరణ్‌కు ‘వీవీఆర్’ లాంటి సినిమా ఇచ్చినందుకు ఓవైపు మెగా అభిమానులు అతడిని తిట్టిపోస్తున్నారు. మరోవైపు బోయపాటి తర్వాతి సినిమా బాలయ్యతో కావడంతో నందమూరి అభిమానులు కంగారు పడుతున్నారు. ఇలాంటి టైంలో మహేష్ బాబుతో సినిమా చేస్తా అని బోయపాటి అనడంతో అతడి అభిమానులు బెంబేలెత్తుతున్నారు. మా హీరోతో సినిమానా చేయనివ్వమంటూ దండాలు పెడుతున్నారు. ఇక చరణ్‌కు ఇలాటి సినిమా ఇచ్చాక బోయపాటితో చిరును సినిమా చేయనిస్తారా మెగా అభిమానులు?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English