సాయి పల్లవికి ఇంకా సీన్‌ వుందా?

సాయి పల్లవికి ఇంకా సీన్‌ వుందా?

ఫిదా టైమ్‌లో సాయి పల్లవికి చాలా క్రేజ్‌ వున్న మాట వాస్తవం. అదే ఎంసిఏ చిత్రానికి కూడా చాలా కలిసి వచ్చింది. అయితే తన క్రేజ్‌ని సాయి పల్లవి సరిగా వినియోగించుకోలేదనిపిస్తోంది. మరీ ఆచి తూచి సినిమాలు సెలక్ట్‌ చేసుకుంటూ వుండడంతో పాటు అన్ని భాషల్లోను ఒకేసారి సినిమాలు చేస్తుండడం వల్ల గ్యాప్‌ చాలా వచ్చేసింది. ఇప్పటి జనాలకి ఒకరిపై వుండే క్రేజు మరొకరిపైకి షిఫ్ట్‌ అయిపోవడానికి ఎక్కువ సమయం పట్టదు. ఈ నేపథ్యంలో సాయి పల్లవికి ఇంకా ఫిదా టైమ్‌ నాటి సీన్‌ వుందా అనేది ఆమెది మరో సినిమా వస్తే కానీ చెప్పలేం.

ఫిదా చిత్రంలో వున్న ఛార్మ్‌, స్పెషల్‌ ఎట్రాక్షన్‌ అయితే ఆమెలో ఇప్పుడు కనిపించడం లేదు. అప్పటికంటే బాగా సన్నబడడం వల్లనో ఏమో ఆమె తన కొత్త చిత్రాల్లో డిఫరెంట్‌గా కనిపిస్తోంది. మారి 2, పడి పడి లేచె మనసు చిత్రాల సాంగ్స్‌ వీడియోల్లో, పోస్టర్లలో సాయి పల్లవి అంతగా ఆకర్షించలేకపోతోంది. మరి యువత ఆమె కోసం మునుపటిలాగానే క్యూ కడతారా లేక ఈసారి అంతగా పట్టించుకోరా? పడి పడి లేచె మనసు చిత్రానికి వచ్చే స్పందన సాయి పల్లవి కెరియర్‌ని డిసైడ్‌ చేస్తుంది. మరీ సెలక్టివ్‌గా వుండడం వల్ల చేతిలో ఎక్కువ సినిమాలు కూడా లేవు కనుక ఈ క్రేజ్‌, డిమాండ్‌ ఇలాగే కొనసాగాలంటే సాయి పల్లవి మరోసారి తన మ్యాజిక్‌ చేసి చూపించాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English