చైతన్య టైమ్‌ స్టార్ట్‌ అయిపోయింది

చైతన్య టైమ్‌ స్టార్ట్‌ అయిపోయింది

నాగచైతన్య ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న ఆ రోజు వచ్చేసినట్టే కనిపిస్తోంది. అతని సినిమాలకి తగిన వసూళ్లు రావడం లేదనే కంప్లయింట్‌ ఎన్నో ఏళ్లుగా వుంది. ఎట్టకేలకు చైతన్య సత్తా తెలిసే చిత్రం వచ్చినట్టే వుంది.

'శైలజారెడ్డి అల్లుడు' అడ్వాన్స్‌ బుకింగ్స్‌ చూస్తోంటే తొలి రోజు అదిరిపోయే వసూళ్లు ఖాయమనిపిస్తోంది. మారుతికి వున్న గుడ్‌విల్‌కి తోడు మాస్‌ ఆడియన్స్‌ని ఆకట్టుకునే లక్షణాలు పుష్కలంగా వుండడంతో ఈ చిత్రానికి ఇనీషియల్‌ క్రేజ్‌ బాగా వుంది. గీత గోవిందం తర్వాత వచ్చిన సినిమాల్లో ఏదీ మళ్లీ మాస్‌ని అలరించలేకపోవడంతో 'శైలజారెడ్డి అల్లుడు'కి అది అడ్వాంటేజ్‌ అవుతుంది.

వినాయకచవితి రోజు విడుదల చేస్తున్నారు కనుక చైతన్య సినిమాల్లో అత్యధిక తొలి రోజు వసూళ్లు ఖాయం చేసుకోవచ్చునని ట్రేడ్‌ చెబుతోంది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది నుంచి పది కోట్ల వరకు షేర్‌ వస్తుందని అంచనాలున్నాయి. అదే జరిగితే కనుక సినిమాకి డీసెంట్‌ టాక్‌ వచ్చినా మూడు లేదా నాలుగు రోజుల్లోనే పెట్టుబడి మొత్తం రాబట్టుకుని లాభాల్లోకి అడుగు పెడుతుంది.

చైతన్యని ఈ చిత్రం నలభై కోట్ల క్లబ్‌లో చేరుస్తుందని అక్కినేని అభిమానుల సందడి కూడా ఇప్పటికే బాగా ఎక్కువైంది. చైతన్యని నెక్స్‌ట్‌ లెవల్‌కి తీసుకెళ్లే సినిమా ఇదే అవుతుందని నాగార్జునతో పాటు అన్నపూర్ణ వర్గాలు కూడా బలంగా నమ్ముతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు