కొత్త జేమ్స్ బాండ్ అతనేనా?

కొత్త జేమ్స్ బాండ్ అతనేనా?

జేమ్స్ బాండ్ సిరీస్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే. దశాబ్దాలుగా ఈ క్యారెక్టర్ యాక్షన్ ప్రియుల్ని అలరిస్తోంది. ప్రస్తుత జేమ్స్ బాండ్ డేనియల్ క్రెయిగ్ ఇప్పటికే నాలుగు బాండ్ సినిమాల్లో నటించాడు. ఇప్పుడు ఈ సిరీస్‌లో మరో సినిమా చేస్తున్నాడు. ఐతే చివరగా చేసిన ‘స్పెక్టర్’ టైంలోనే తాను ఇక బాండ్ పాత్రలో నటించనని చెప్పాడు క్రెయిగ్. బాండ్ సినిమాలు చేయడం నరకప్రాయమని అతనన్నాడు

. ఐతే అతడిని బలవంతపెట్టి.. భారీ పారితోషకం ఆఫర్ చేయడం ద్వారా నిర్మాణ సంస్థ మరో సినిమా చేయిస్తోంది. కానీ దీని తర్వాత మాత్రం అతను బాండ్‌గా కొనసాగడం లేదు. ఈ మేరకు ముందే ఒప్పందం కూడా జరిగినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ ఇప్పటికే కొత్త బాండ్ కోసం వేట మొదలుపెట్టేసిందట. సంప్రదాయానికి విరుద్ధంగా ఈసారి బాండ్ పాత్ర విషయంలో ఒక ప్రయోగం చేయనుందట ప్రొడక్షన్ హౌజ్. తొలిసారిగా ఓ నల్లజాతి నటుడిని బాండ్‌గా పరిచయం చేయనున్నట్లు హాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. బ్రిటిష్ నటుడు ఇద్రీస్‌ ఎల్బా పేరును పరిశీలిస్తున్నారట. ఇప్పటిదాకా బాండ్‌గా కనిపించిన నటులందరూ శ్వేత జాతీయులే. మరి బాండ్ పాత్రలో ఓ నల్ల జాతీయుడిని ప్రేక్షకులు అంగీకరిస్తారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

ఐతే విల్ స్మిత్ సహా ఎంతోమంది నల్ల జాతి నటులు హాలీవుడ్లో పెద్ద స్టార్లుగా ఎదిగిన నేపథ్యంలో బాండ్‌గా నల్ల జాతీయుడిని ప్రేక్షకులు ఎందుకు అంగీకరించరన్న ప్రశ్నా వస్తోంది. ఇది ప్రేక్షకులకు కొత్తగా కూడా అనిపిస్తుందని అంటున్నారు. చూద్దాం మరి నిజంగా ఇద్రీస్‌ ఎల్బానే బాండ్ అవుతాడేమో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు