సమంత తల్లికి చైతూనే చెబుతాడట

సమంత తల్లికి చైతూనే చెబుతాడట

అక్కినేని నాగచైతన్యను పెళ్లాడటానికి చాలా ఏళ్ల ముందే సమంత తెలుగమ్మాయిగా మారిపోయింది. కథానాయికగా పరిచయమైంది తమిళ సినిమాతోనే అయినా.. సామ్ స్టార్ స్టేటస్ సంపాదించింది మాత్రం తెలుగులోనే. ఇక్కడే ఎక్కువ సినిమాలు చేస్తూ.. ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకుని తెలుగు అమ్మాయిలా మారిపోయింది సామ్.

ఆమె కుటుంబం గురించి ఏ సమాచారం బయటికి వచ్చేది కాదు. సామ్ తల్లిదండ్రులు అసలు హైదరాబాద్‌లో కనిపించేవాళ్లే కాదు. తమ కుటుంబం గురించి సమంత మాట్లాడటం కూడా అరుదు. ఐతే సామ్ ఫ్యామిలీ గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన అత్త మామలతో తాను చాలా క్లోజ్ అని అతను చెప్పాడు. సమంత తల్లిదండ్రులు సినిమాలకు పూర్తిగా దూరం అని.. తమ కూతురి సినిమాల్ని కూడా వాళ్లు పట్టించుకోరని చైతూ చెప్పాడు.

తాను చెన్నై వెళ్లినపుడల్లా అత్త మామల్ని కలుస్తుంటానని.. అలాగే సమంత సినిమా విడుదలకు దగ్గర పడితే.. ‘మీ అమ్మాయి సినిమా రిలీజవుతోంది. వెళ్లి చూడండి’ అంటూ తానే మెసేజ్ పెడుతుంటానని చైతూ చెప్పాడు. తమ అమ్మాయి దశాబ్దం పైగా సినీ రంగంలో ఉంటున్నప్పటికీ.. సినిమాలతో కానీ.. ఫిలిం ఇండస్ట్రీతో వాళ్లకు ఎలాంటి కనెక్షన్ లేదని చైతూ చెప్పాడు. సమంత సోదరుల్లో ఒకరు అమెరికాలో.. మరొకరు చెన్నైలో ఉంటారని.. వాళ్లు కూడా ఇదే తరహా అని చైతూ చెప్పాడు.

ఇక తాను, సమంత తల్లిదండ్రులు ఎప్పుడు అవుతామని తన తండ్రితో పాటు అందరూ అడుగుతున్నారని.. సమయం వచ్చినపుడు కచ్చితంగా చెబుతానని అన్నాడు చైతూ. తాను సమంత కలిసి ఇంట్లోనే జిమ్ చేసుకుంటామని.. ఎప్పుడూ ఇద్దరూ కలిసే వర్కవుట్లు చేస్తామని.. రాత్రి 7.30-8 మధ్య మొదలుపెట్టి గంటన్నర రెండు గంటలు కసరత్తులు చేస్తామని.. తమ ఇద్దరికీ అది మంచి బాండింగ్ టైం అని అన్నాడు చైతూ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు