రానా మిస్సయిన బ్లాక్ బస్టర్

రానా మిస్సయిన బ్లాక్ బస్టర్

దగ్గుబాటి రానా హీరోగా కెరీర్ ఆరంభించాక కొన్నేళ్ల పాటు బాగానే ఇబ్బంది పడ్డాడు. ‘లీడర్’ యావరేజ్‌గా ఆడగా.. ఆ తర్వాత వచ్చిన ‘నా ఇష్టం’.. ‘నేను నా రాక్షసి’ సినిమాలు దారుణ ఫలితాన్నందుకున్నాయి. అలాంటి సమయంలోనే క్యారెక్టర్, నెగెటివ్ రోల్స్ వైపు మళ్లి తన కెరీర్‌ను మలుపు తిప్పుకున్నాడు రానా.

‘ఆరంభం’.. ‘బాహుబలి’.. ‘బేబీ’ ‘రుద్రమదేవి’.. ‘ఘాజీ’ సినిమాలు అతడికి వివిధ భాషల్లో మంచి పేరు.. మార్కెట్ తీసుకొచ్చాయి. ఐతే సోలో హీరోగా మాత్రం రానా ఇంకా పెద్దగా నిలదొక్కుకోలేదు అనుకుంటున్న సమయంలో గత ఏడాది ‘నేనే రాజు నేనే మంత్రి’ మంచి ఫలితాన్నందించింది. ఐతే దీంతో పాటుగా రానా సోలో హీరోగా ఇంకో హిట్ కూడా కొట్టాల్సిందట. కానీ అది మరో హీరో ఖాతాలో పడిపోయింది.

ఆ సినిమా మరేదో కాదు.. కళ్యాణ్ రామ్ కెరీర్లో అతి పెద్ద హిట్టుగా నిలిచిన ‘పటాస్’. ఈ కథను దర్శకుడు అనిల్ రావిపూడి ముందుగా రానా తండ్రి దగ్గుబాటి సురేష్‌కే చెప్పారట. ఆయనకు కథ నచ్చి.. కొన్ని మార్పులు చేర్పులతో రానా హీరోగా ప్రొడ్యూస్ చేయాలని అనుకన్నాడట. కానీ అప్పటికే ‘బాహుబలి’లో రానా బిజీగా ఉండటం.. వెంటనే ఈ సినిమాకు డేట్లు కేటాయించే పరిస్థితి లేకపోవడంతో ఇది పట్టాలెక్కలేదని సురేష్ చెప్పారు.

అనిల్ ఎక్కువ రోజులు ఆగలేక కళ్యాణ్ రామ్‌ను కలవడం, అతడికీ కథ నచ్చి తనే హీరోగా సొంత బేనర్లో సినిమాను ప్రొడ్యూస్ చేయడంతో ‘పటాస్’ తెరమీదికి వచ్చింది. ఐతే ‘బాహుబలి’లో భల్లాలదేవగా దేశవ్యాప్తంగా తిరుగులేని ఇమేజ్ సంపాదించాడు కాబట్టి ‘పటాస్’ మిస్సయినందుకు రిగ్రెట్ అయి ఉండడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు