త్రివిక్రమ్ చెబితే ఈ సినిమా చేశాడట

త్రివిక్రమ్ చెబితే ఈ సినిమా చేశాడట

విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రల్లోకి మారాక జగపతిబాబు దాదాపు హీరో వేషాలు మానేశాడు. మధ్యలో ‘పటేల్ సర్’ అనే సినిమా ఒక్కటి హీరోగా చేస్తే అది ఫ్లాప్ అయింది. ఇప్పుడాయన నారా రోహిత్‌తో కలిసి మరోసారి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఆటగాళ్ళు’. ఈ నెల 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో జగపతిబాబు మాట్లాడుతూ త్రివిక్రమ్ శ్రీనివాస్ చెబితేనే ఈ సినిమా చేశాననడం విశేషం. ఈ చిత్ర దర్శకుడు పరుచూరి మురళి గురించి త్రివిక్రమ్ చాలా పాజిటివ్‌గా మాట్లాడటంతోనే ఈ సినిమా ఒప్పుకున్నానని అన్నాడు.

దర్శకుడు పరుచూరి మురళి ఇంతకుముందే తనతో పెదబాబు సినిమా చేశాడని.. త్రివిక్రమ్ తనతో ఒక సందర్భంలో మాట్లాడుతూ మురళి మంచి విషయం ఉన్నోడని  అని చెప్పాడని జగపతిబాబు చెప్పాడు. త్రివిక్రమ్ అలా చెప్పడంతోనే తాను ఈ సినిమా చేశానని.. ఫైనల్ ఔట్ ఫుట్ చూశాక చాలా సంతోషంగా అనిపించిందని జగపతిబాబు చెప్పాడు.

ఆటగాళ్లు వంటి సినిమా చేయడం కొంతవరకు రిస్కే అని..  అయినా నిర్మాతలు బడ్జెట్‌ విషయంలో ఎక్కడా వెనకాడకుండా సినిమాని చాలా రిచ్‌గా తీశారని జగపతి అన్నాడు. తన కెరీర్లో తొలిసారి లాయర్ క్యారెక్టర్ చేశానన్నాడు. సినిమాలో అన్నీ కొత్తగా ఉంటాయని.. స్క్రీన్‌ప్లే బాగా వర్కవుట్ అయిందని.. ఈ సినిమా కచ్చితంగా విజయవంతమవుతుందని జగపతి ధీమా వ్యక్తం చేశాడు. ఈ సినిమా తమ కోసం కాకపోయినా.. నిర్మాతల కోసమైనా ఆడాలన్నాడు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English