తన పొలాన్ని చూపించిన రాజమౌళి

తన పొలాన్ని చూపించిన రాజమౌళి

సినీ రంగంలో నాలుగు రాళ్లు సంపాదించిన ప్రతి ఒక్కరూ.. భూమి మీద పెట్టుబడి పెట్టడం రివాజుగా మారింది. ఇందులో కొందరు హైదరాబాద్ శివార్లలో పొలం కొనుక్కుని ఫామ్ హౌస్ గా మార్చుకుంటున్నారు. అక్కడే చిన్న ఇల్లు కట్టుకుని.. తమ పొలాలకు కాంపౌండ్ వాల్ వేసుకుని.. మనుషుల్ని పెట్టి ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు. పళ్ల తోటలు పెంచుతున్నారు.

దర్శక ధీరుడు రాజమౌళి సైతం ఈ బాటలోనే నడిచాడు. ‘బాహుబలి’తో భారీగా ఆదాయం ఆర్జించిన ఆయన.. హైదరాబాద్ శివార్లలో పెద్ద ఎత్తున పొలం కొన్నట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. కానీ అది ఎక్కడ ఏంటి అన్న వివరాలు తెలియలేదు. ఆ పొలం ఎలా ఉంటుందన్నది కూడా జనాలకు తెలియదు. ఐతే ఈ రోజు స్వయంగా రాజమౌళే తన పొలాన్ని పరిచయం చేశాడు.

తెలంగాణ ఎంపీ కల్వకుంట్ల కవిత.. తాజాగా ‘హరిత హారం’ కార్యక్రమంలో భాగంగా కొందరు సెలబ్రెటీలకు మొక్కలు నాటమని ఒక ఛాలెంజ్ విసిరారు. అందులో రాజమౌళి కూడా ఉన్నాడు. ఆయన ఆ ఛాలెంజ్ ని సీరియస్ గానే తీసుకున్నారు. తన పొలంలో మర్రి.. వేప.. ఇలా రకరకాల చెట్లు నాటారు. తన పొలంలో చెట్టు నాటుతున్న ఫొటో తీసి దాన్ని ట్విట్టర్లో షేర్ చేశారు.

జక్కన్న పక్కన ఆయన ప్రేమగా పెంచుకునే కుక్క కూడా ఉంది. వెనుక పొలంలో పంట కనిపిస్తోంది. ఆ వెనుక తాటి చెట్టుంది. ఇక రాజమౌళి కూడా కొందరు సెలబ్రెటీలకు ఛాలెంజ్ విసిరాడు. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్.. కవిత అన్నయ్య.. మంత్రి కేటీఆర్.. ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. ‘మహానటి’ డైరెక్టర్  నాగ్ అశ్విన్ లకు జక్కన్న సవాలు విసిరాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు