తేజస్విని మళ్లీ తీసుకొచ్చే బిగ్‌ ప్లాన్‌!

తేజస్విని మళ్లీ తీసుకొచ్చే బిగ్‌ ప్లాన్‌!

బిగ్‌బాస్‌ అంచనాలని తల్లకిందులు చేస్తూ తేజస్వి మాడివాడ ఆరవ వారంలో ఎలిమినేట్‌ అయింది. ఆమెని హౌస్‌లోంచి బయటకి పంపించకుండా వుండేందుకు బిగ్‌బాస్‌ చేయని ప్రయత్నమంటూ లేదు. చివరకు హోస్ట్‌ నాని కూడా ఆమె ఆగడాలు చూసీ చూడనట్టు వదిలేసాడు. కానీ తన ఉనికికే ప్రమాదం ఏర్పడి, అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ఆమెని ఒకసారి మాత్రం కాస్త గట్టిగా మందలించాడు. గత వారం ఆమె ఎలిమినేషన్లలోకి రాగానే తేజస్విని బ్యాక్‌గ్రౌండ్‌లో వుంచి జనం దృష్టి మరల్చడానికి భలే ట్రై చేసారు కానీ ఆమె పట్ల వున్న వ్యతిరేకత వల్ల ఓట్ల తాకిడిని తట్టుకోలేకపోయారు.

ఆమె వెళ్లిపోయిందనే అక్కసు నానిలో కూడా కనిపించింది. జనాన్ని తప్పుబడుతూ 'మీ ఖర్మ' అంటూ రచ్చబండ హోస్ట్‌లా ఒక స్పీచ్‌ కూడా ఇచ్చాడు. ఇదిలావుంటే తేజస్వి అలా బయటకి పోయిందో లేదో, ఇంతవరకు ఎలిమినేట్‌ అయిన హౌస్‌మేట్స్‌లో ఎవరైనా ఒకరిని తిరిగి హౌస్‌లోకి పంపించండి అంటూ కొత్త పోల్‌ స్టార్ట్‌ చేసారు. బయటకి పోయిన వారిలో స్ట్రాంగ్‌ కంటెస్టెంట్స్‌లో ముందుండేది తేజస్వి. అలాగే భానుశ్రీ కూడా తర్వాత వుంటుంది. సో ఈ పోల్‌లో తేజస్వి గెలిచేసి మళ్లీ హౌస్‌లోకి వచ్చేస్తుందని బిగ్‌బాస్‌ పెద్ద ప్లానే వేసినట్టు కనిపిస్తోంది. అయితే సోషల్‌ మీడియా ట్రెండు చూస్తే ఈ పోల్‌ నూతన్‌ నాయుడు, శ్యామలకి అనుకూలంగా వుంది. నూతన్‌ నాయుడు మంచి ఎంటర్‌టైనర్‌ అనిపించుకుంటోన్న దశలో అవుట్‌ అయ్యాడు.

అతను వెళ్లిపోయాక అయ్యో ఇంకొన్నాళ్లు వుండాల్సిందే అని చాలా మంది భావించారు. అలాగే బయటకి వెళ్లిన వారిలో అసలు నెగెటివిటీ లేకుండా విచిత్రమైన పరిస్థితుల్లో బయటకి వచ్చింది యాంకర్‌ శ్యామల. వీరిని దాటుకుని పోల్స్‌లో తేజస్వి గెలిచి మళ్లీ హౌస్‌లో అడుగు పెట్టాలంటే మాత్రం మార్కెటింగ్‌కి చాలా ఖర్చు పెట్టాల్సి వుంటుంది. ఇప్పటికే ఒకసారి చేసిన ఇన్వెస్ట్‌మెంట్‌ వేస్ట్‌ అయిన నేపథ్యంలో మళ్లీ హౌస్‌లోకి వెళ్లడానికి తేజస్వి గట్టి ప్రయత్నాలు చేస్తుందా? అందులోను తన పట్ల సోషల్‌ మీడియాలో వున్న వ్యతిరేకత ఏ స్థాయిలో వుందో స్వయంగా చూసాక కూడా టైటిల్‌ గెలిచే అవకాశాలున్నాయని భ్రమ పడుతుందా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English