ప్రకాష్ రాజ్ సాక్ష్యం చెబుతున్నాడట

ప్రకాష్ రాజ్ సాక్ష్యం చెబుతున్నాడట

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పటివరకు కెరీర్ లో చేసింది తక్కువ సినిమాలే అయినా వాటిలో స్పీడున్నోడు మినహా అన్నీ క్రేజీ ప్రాజెక్టులు... భారీ బడ్జెట్ చిత్రాలు. తాజాగా శ్రీవాస్ డైరెక్షన్ లో సాక్ష్యం సినిమా పూర్తి చేశాడు. ఈనెల 27న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి ఇప్పుడింకో అట్రాక్షన్ జత కలిసింది.

సాక్ష్యం మూవీ ఓ సూపర్ నాచురల్ ఎలిమెంట్ తో వస్తోంది. కథతో ప్రేక్షకులు ఈజీగా కనెక్టయ్యేలా వాయిస్ ఓవర్ ఉంటే బాగుంటుందని డైరెక్టర్ శ్రీవాస్ ఫీలయ్యాడు. ప్రేక్షకులకు బాగా పరిచితమైన గొంతు అయితేనే మంచిదని అనుకున్నాడు. అందుకే గంభీరమైన గొంతు ఉండే నటుడు ప్రకాష్ రాజ్ ను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిందిగా కోరాడట. ఈ మూవీ ప్రొడ్యూసర్ అభిషేక్ తో ప్రకాష్ రాజ్ కున్న సన్నిహిత సంబంధం ఉంది. దీంతో వెంటనే ఓకే చెప్పి పని పూర్తి చేశాడని యూనిట్ సభ్యుడొకరు తెలిపారు. సాక్ష్యం మూవీ బిగినింగ్ తోపాటు మధ్యలోనూ ప్రకాష్ రాజ్ గొంతు వినిపిస్తుందని తెలిసింది.

ప్రకాష్ రాజ్ తాజాగా భరత్ అనే నేను సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం అతడు చేస్తున్న సినిమాలు లేవీ నిర్మాణ దశలో లేవు. కాబట్టి తెరపై ప్రకాష్ రాజ్ ను చూడలేకపోయినా సాక్ష్యం మూవీతో అతడి గొంతు వినొచ్చన్నమాట. తెలుగులో ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇదే మొదటిసారి. దువ్వాడ జగన్నాథమ్ తో ఒక్కసారి స్టార్ స్టేటస్ దక్కించేసుకున్న పూజా హెగ్డే సాక్ష్యంలో హీరోయిన్ గా నటించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు