చిరంజీవి బర్త్‌డేకి చరణ్‌ గిఫ్ట్‌

చిరంజీవి బర్త్‌డేకి చరణ్‌ గిఫ్ట్‌

మెగాస్టార్‌ చిరంజీవి బర్త్‌డే వేడుకలకి సిద్ధమవుతోన్న మెగా అభిమానులకి శుభవార్త. ఆగస్ట్‌ 22న చిరంజీవి బర్త్‌డేతో పాటు ఫాన్స్‌కి సంబరాలు చేసుకోవడానికి చరణ్‌ మరో కారణాన్ని కూడా ఇస్తున్నాడు. చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఫస్ట్‌ లుక్‌తో పాటు టైటిల్‌ కూడా అదే రోజు రివీల్‌ చేయబోతున్నారు. వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రం ఎలా వుంటుందనే దానిపై ఇంతవరకు ఎలాంటి ఐడియా లేదు.

బోయపాటి మాస్‌ సినిమాలకి పెట్టింది పేరయినా కానీ ఇటీవల వైవిధ్యభరిత కథలు ఎంచుకుంటోన్న చరణ్‌ మళ్లీ రొటీన్‌ మసాలా కథని ఎంచుకోడనే అనుకుంటున్నారు. ఫస్ట్‌ లుక్‌తో పాటు టైటిల్‌ కూడా రివీల్‌ అయిపోతే ఈ సినిమాపై ఒక అవగాహన ఏర్పడుతుంది. రంగస్థలంకి ముందు రేసులో వెనకబడిపోయిన రామ్‌ చరణ్‌ ఆ చిత్రంతో మరోసారి టాప్‌ హీరోల రేసులో ముందుకొచ్చేసాడు.

నాన్‌ బాహుబలి రికార్డులు నెలకొల్పి కంటెంట్‌ వున్న సినిమాతో ఎంత రేంజ్‌ సాధించగలడనేది చూపించాడు. అంతకుముందు చరణ్‌పై దాదాపు నమ్మకం కోల్పోయే దశకి వచ్చిన అభిమానుల్లో మళ్లీ నెక్స్‌ట్‌ మెగాస్టార్‌ చరణే అనే నమ్మకాన్ని కలిగించాడు. తదుపరి వచ్చే చిత్రంతోను విజయం సాధించినట్టయితే చరణ్‌పై ఫాన్స్‌ పెట్టుకున్న నమ్మకం పదింతలు అవుతుందనడంలో సందేహం లేదు. అన్నట్టు అదే రోజున 'సైరా నరసింహారెడ్డి' ఫస్ట్‌ లుక్‌ కూడా వచ్చే అవకాశముందని సినీ పరిశ్రమలో చెప్పుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు