పోలాండ్ పోరగాడినీ వాడేసుకుంటున్నారు

పోలాండ్ పోరగాడినీ వాడేసుకుంటున్నారు

పవర్ స్టార్ ఫవన్ కళ్యాణ్ చివరగా నటించిన అజ్ఞాతవాసి సినిమా ప్రమోషన్ల టైంలో వెలుగులోకి వచ్చాడు పోలాండ్ కు చెందిన  జిబిగ్స్ బుజ్జి. ఆ సినిమాలో కొడకా.. కోటేశ్వరరావు సాంగ్ ను చక్కగా పాడి ఈ ఏడాది మొదట్లో పవర్ స్టార్ కు న్యూ ఇయర్ గిఫ్ట్ అంటూ పోస్ట్ చేయడంతో ఇతడి గురించి అందరికీ తెలిసింది. తనపై అభిమానంతో ఈ పిల్లాడు చేసిన ప్రయత్నాన్ని పవన్ కూడా మెచ్చుకుని రిప్లయ్ ఇవ్వడంతో బాగా పాపులర్ అయ్యాడు.

ఈమధ్య ఈ జిబిగ్స్ బుజ్జి హైదరాబాద్ వచ్చాడు. మెగా బ్రదర్ నాగేంద్రబాబును... అక్కినేని అఖిల్ ను కలిసి సరదాగా వారితో టైం స్పెండ్ చేశాడు. ఇదే సందర్భంలో త్వరలో రాబోతున్న ఆటగదరా శివ సినిమా లీడ్ యాక్టర్ ఉదయ్ ను జిబిగ్స్ బుజ్జి ఇంటర్వ్యూ చేసేశాడు. వీడియో కాన్ఫరెన్స్ లో చేసిన ఈ ఇంటర్వ్యూ డీటైల్స్ ను బుజ్జి తన ట్విట్టర్ టైం లైన్ లో షేర్ చేశాడు. తెలుగు సినిమాలపై అభిమానంతో ఎక్కడో పోలెండ్ నుంచి ఇక్కడకు వచ్చిన ఈ కుర్రాడిని కూడా మన సినిమా వాళ్లు ఇలా ప్రమోషన్ కు వాడేసుకోవడం విశేషం.

కన్నడ నిర్మాత రాక్‌లైన్ వెంక‌టేశ్ నిర్మిస్తోన్న మూవీ ఆట‌గ‌ద‌రా శివ‌. కొత్త నటుడు ఉద‌య్ శంక‌ర్, కన్నడ నటుడు దొడ్డన్న ప్రధాన పాత్రల్లో నటించారు. ఆ న‌లుగురు ఫేమ్ చంద్రసిద్ధార్ధ్ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు.  కన్నడలో హిట్టయిన రామా రామారే సినిమాకు రీమేక్‌గా ఆటగదరా శివ వస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు