నా జుట్టంతా పోయింది - ర‌జ‌నీ

నా జుట్టంతా పోయింది - ర‌జ‌నీ

'నా జుట్టంతా పోయింది. నా మొహంలో క‌ళ కూడా పోయింది. మా ఫ్రెండును చూడండి... అత‌ని మొహంలో చాలా క‌ళ ఉంది. నెత్తి మీద కూడా బాగా జుట్టుంది. ఆయన హెయిర్ స్టైల్‌ కూడా బాగుంటుంది. ఆ హెయిర్ స్టైల్‌కు మెయింటెయిన్ చేయ‌డానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో నాకు తెలిసున్నా, ఆయ‌న చెప్పినా నేను కూడా కేర్‌ తీసుకునేవాడిని.. ఇపుడు నెత్తిమీద జుట్టే లేదు నాకు’ అంటూ ర‌జ‌నీకాంత్ స‌ర‌దాగా మాట్లాడుతూ అంద‌రినీ న‌వ్వించారు. అత‌ని హార్డ్ వ‌ర్క్ అంటే చాలా ఇష్టం. అత‌ని జుట్టు అంటే ఇంకా ఇష్టం అని చ‌మ‌త్క‌రించారు.

ఇంత‌కీ ఎక్క‌డ జ‌రిగిందీ సంఘ‌ట‌న అంటే... ఎవ‌రా స్నేహితుడు అంటే... చెన్నైలో త‌మిళ‌నాడుకు చెందిన ప్ర‌ముఖుడు, రాజ‌కీయ నేత ఏసీ ష‌ణ్ముగంను ఒక యూనివ‌ర్సిటీ డాక్ట‌రేట్‌తో స‌త్క‌రించ‌డానికి ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం ఏర్పాటుచేసింది. దీనికి ష‌ణ్ముగం స్నేహితుడు ర‌జ‌నీకాంత్‌ను ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా ర‌జ‌నీకాంత్ మాట్లాడారు.
అయితే, ఈ స‌భ‌లో ఈ సర‌దా సంఘ‌ట‌న‌తో పాటు సీరియ‌స్‌గా టంగ్ స్లిప్ అయ్యారు త‌లైవా. నా స్నేహితుడు ఐర‌న్‌లాగా ప‌నిచేస్తాడు, చీమంత బ‌లంగా ఉంటాడు... అనేసి రివ‌ర్స్‌లో వ్యాఖ్యానించాన‌ని అర్థం చేసుకున్న ర‌జ‌నీకాంత్‌... వెంట‌నే ఇక సోష‌ల్ మీడియా న‌న్ను ట్రోల్ చేయ‌కుండా వ‌దిలిపెడుతుందా అంటూ న‌వ్వేసి క‌వ‌ర్ చేశారు.
ప్ర‌స్తుతం త‌లైవా రోబో-2తో పాటు  కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు. విజ‌య్‌సేతుప‌తి ఇందులో విల‌న్‌. బహుశా ఇదే ర‌జ‌నీకాంత్ చివ‌రి సినిమా కావ‌చ్చు. ఆ త‌ర్వాతంతా ఇక పూర్తి రాజ‌కీయ‌మే.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమాల్లో ఎంత స్టైల్‌గా, హ్యాండ్సమ్‌గా కనిపించినా..బయట మాత్రం చాలా సింపుల్‌గా ఉంటారు. ఆయనకు జుట్టు లేకపోయినప్పటికీ ఎలాంటి విగ్గులు పెట్టుకోకుండా నేచురల్‌గా ఉండటానికే ఇష్టపడతారు. అయితే ఇటీవల తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ నేత ఏసీ షణ్ముగన్‌ను డాక్టరేట్‌తో‌ సత్కరించేందుకు చెన్నైలో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తలైవా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రజనీ..తన స్నేహితుడైన షణ్ముగన్‌ గురించి మాట్లాడుతూ..‘షణ్ముగన్‌ నాకు దాదాపు 1980 నుంచి తెలుసు. ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. ఈ వయసులోనూ అతని ముఖంలో కళ ఉంది. ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. ఆయన హెయిర్‌స్టైల్‌ కూడా బాగుంటుంది. ఆయన తన హెయిర్‌స్టైల్‌కు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో తెలిసుంటే నేను కూడా కేర్‌ తీసుకునేవాడిని’ అని చమత్కరించారు రజనీ. ఆయన ప్రసంగం విని అక్కడున్న వారంతా పగలబడి నవ్వుకున్నారు.

ప్రస్తుతం రజనీ..కార్తిక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో వస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విజయ్‌ సేతుపతి ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఇందులో తలైవాకు జోడీగా కాజల్‌ అగర్వాల్‌ నటించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ఈ సినిమా తర్వాత రజనీ పూర్తిగా రాజకీయాలపైనే దృష్టిపెడతారని కోలీవుడ్‌ వర్గాలు వెల్లడించాయి.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English