2.0 రిలీజ్ డేట్ ఇచ్చారు సరే..

2.0 రిలీజ్ డేట్ ఇచ్చారు సరే..

ఎప్పుడెప్పుడా అని ఎదుర చూస్తున్న కబురు వచ్చేసింది. ఎట్టకేలకు ‘2.0’ రిలీజ్ డేట్ ఖరారైంది. కొన్ని నెలల నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ సౌత్ ఇండియన్ ఏస్ డైరెక్టర్ శంకర్ ‘2.0’ రిలీజ్ డేట్ ప్రకటించాడు. ఈ ఏడాది నవంబరు 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుందన్నాడు. గత ఏడాది దీపావళికే రావాల్సిన ఈ చిత్రం ఇంత ఆలస్యం కావడానికి విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో ఆలస్యమే కారణమన్న సంగతి తెలిసిందే.

ఐతే ప్రస్తుతం ఆ పనులు చేస్తున్న స్టూడియో ఫైనల్ ఔట్ పుట్ ఇవ్వడానికి డేట్ ఇచ్చిందని.. దీంతో విడుదలకు మార్గం సుగమమైందని.. కాబట్టే రిలీజ్ డేట్ ప్రకటిస్తున్నామని శంకర్ అనౌన్స్ చేశాడు.

కానీ నిజంగా శంకర్ ఇచ్చిన ఈ రిలీజ్ డేట్‌కైనా సినిమా వస్తుందా అన్న సందేహాలు లేకపోలేదు. ఇంతకుముందు కూడా వీఎఫెక్స్ స్టూడియోల్ని నమ్ముకునే డేట్ ఇచ్చారు. కానీ డెడ్ లైన్ అందుకోలేకపోయారు. ఒక హాలీవుడ్ స్టూడియో ముందు హామీ ఇచ్చి ఆ తర్వాత డెలివరీ ఇవ్వకపోవడంతో సినిమా పలుమార్లు వాయిదా పడింది. మరి ఇప్పుడు వీఎపెక్స్ పని చేపట్టిన స్టూడియో మాత్రం మాట నిలబెట్టుకుంటుందా.. అనుకున్న గడువుకు ఔట్ పుట్ ఇస్తుందా.. ఆ ఔట్ పుట్ శంకర్‌కు నచ్చుతుందా అన్న సందేహాలు లేకపోలేదు.

ఎలాగూ అవ్వాల్సిన లేటు అయింది. ఔట్ పుట్ చేతికొచ్చి దానిపై సంతృప్తి వ్యక్తం చేశాక రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాల్సిందేమో శంకర్. ఐతే మధ్యలో ఏ ఇబ్బందులూ లేకుండా నవంబరు 29న పక్కాగా సినిమా రావాలని ఆకాంక్షిద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English