ఫ్లాప్‌ హీరోకి మహానటి భరోసా

ఫ్లాప్‌ హీరోకి మహానటి భరోసా

ఒకప్పుడు తమిళ, తెలుగు రంగాలని ఊపేసిన విక్రమ్‌కి ఇటీవల ఏదీ కలిసి రావడం లేదు. అతను నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద బాల్చీ తన్నేస్తున్నాయి. మార్కెట్‌ సాంతం కోల్పోయిన విక్రమ్‌కి ఇప్పుడు చివరి ఆశగా మారింది సామి స్క్వేర్‌. హరి డైరెక్షన్‌లో విక్రమ్‌ చేసిన సామి అప్పట్లో బ్లాక్‌బస్టర్‌. తెలుగులోకి లక్ష్మీనరసింహాగా రీమేక్‌ అయి ఘన విజయాన్ని అందుకుంది.

మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న సామి స్క్వేర్‌ కూడా మాస్‌ని మెప్పించే అంశాలతో రూపొందింది. అయితే 'యముడు' సిరీస్‌ మాదిరిగా దీనిని హరి చాలా లౌడ్‌గా తీర్చిదిద్దాడనిపిస్తోంది. ట్రెయిలర్‌ కూడా చాలా ట్రోలింగ్‌కి గురయింది. కాకపోతే ఇందులో హీరోయిన్‌ కీర్తి సురేష్‌ కావడం ప్లస్‌ అవుతుందనే ధీమాని చిత్ర బృందం వ్యక్తం చేస్తోంది. మహానటి తర్వాత వస్తోన్న కీర్తి సురేష్‌ చిత్రం కావడం తమిళంలో ఎలాగున్నా తెలుగులో మాత్రం హెల్ప్‌ అవుతుందనే అనుకుంటున్నారు.

విక్రమ్‌ బ్యాడ్‌ టైమ్‌కి కీర్తి సురేష్‌ ఎండ్‌ కార్డ్‌ వేసేసి మళ్లీ అపరిచితుడికి పూర్వ వైభవాన్ని తెస్తుందా లేదా అనేది సామి స్క్వేర్‌ వచ్చాక తెలుస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు