ఫ్లాప్ హీరో బాగానే తెచ్చాడబ్బా

ఫ్లాప్ హీరో బాగానే తెచ్చాడబ్బా

యాక్షన్ హీరో గోపీచంద్ చివరగా ఎప్పుడు హిట్టు కొట్టాడో కూడా జనాలు మరిచిపోయారు. గత కొన్నేళ్లలో వచ్చిన అతడి సినిమాలన్నీ తీవ్ర నిరాశకు గురి చేశాయి. ఇప్పుడతేను ‘పంతం’ మీదే ఆశలు పెట్టుకున్నాడు. గురువారం రిలీజైన ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. ఐతే గోపీ ట్రాక్ రికార్డు పేలవంగా ఉన్నా.. సినిమాకు డివైడ్ టాక్ కూడా వచ్చినా ఓపెనింగ్స్ అయితే బాగా వచ్చాయి ఈ చిత్రానికి.

తొలి రోజు ‘పంతం’ రూ. 5 కోట్లకు పైగా గ్రాస్.. రూ.3.2 కోట్ల షేర్ వసూలు చేయడం విశేషం. తొలి రోజు ఈ సినిమాకు మాస్ సెంటర్లలో హౌస్ ఫుల్స్ పడ్డాయి. బి-సి సెంటర్లలో ఈ చిత్రానికి రెస్పాన్స్ బాగానే ఉంది. గోపీచంద్ నుంచి మాస్ ప్రేక్షకులు ఆశించే అంశాలకైతే సినిమాలో లోటు లేదు. యాక్షన్.. కామెడీ వరకు సినిమా ఓకే అనిపిస్తుంది. కానీ కొత్తదనం లేని ఫార్ములా కథ.. రొటీన్ కథనం సినిమాకు మైనస్ అయ్యాయి. దీంతో సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. ఐతే వీకెండ్ వరకు సినిమా ఎలాగోలా నిలబడుతుందనే భావిస్తున్నారు. మరి ఈలోపు వసూళ్లు ఏమేర వస్తాయో చూడాలి. గోపీచంద్‌కిది 25వ సినిమా కావడంతో ట్రాక్ రికార్డుతో సంబంధం లేకుండా దీనిపై బాగానే ఖర్చు పెట్టాడు నిర్మాత రాధామోహన్.

బడ్జెట్ రికవర్ కావాలంటే సినిమా రెండు వారాల పాటు బాగా ఆడాలి. ఐతే టాక్ అటు ఇటుగా ఉన్న నేపథ్యంలో వసూళ్లు ఎలా ఉంటాయో అంచనా వేయలేని విధంగా ఉంది పరిస్థితి. కొత్త దర్శకుడు చక్రవర్తి రూపొందించిన ఈ చిత్రంలో గోపీచంద్ సరసన మెహ్రీన్ కౌర్ నటించింది.