మెగా హీరోతో దిల్‌ రాజు పంతం!

మెగా హీరోతో దిల్‌ రాజు పంతం!

సాయి ధరమ్‌ తేజ్‌తో వరుసగా మూడు చిత్రాలు నిర్మించిన దిల్‌ రాజు ఆ తర్వాత మరికొన్ని చిత్రాలు అతనితో చేద్దామని చూసాడు. అయితే ఎన్ని సినిమాలు తీసినా కానీ తన పారితోషికం పెంచకుండా, తన క్రేజ్‌ని క్యాష్‌ చేసుకుంటున్నాడని తేజ్‌ ఆ బ్యానర్‌ నుంచి బయటకి వచ్చేసాడు. లేదంటే 'శతమానం భవతి'తో పాటు మరో రెండు చిత్రాలు దిల్‌ రాజుతోనే చేసి వుండేవాడు.

దిల్‌ రాజుతో తెగతెంపులు చేసుకున్నాక తేజ్‌కి అసలు ఏమీ కలిసి రాలేదు. ఇవాళ కాకపోతే రేపయినా మళ్లీ తనని వెతుక్కుంటూ వస్తాడని దిల్‌ రాజు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో తేజ్‌ నటించిన 'తేజ్‌ ఐలవ్యూ' చిత్రానికి రిలీజ్‌ ముందు క్రేజ్‌ బాగానే వచ్చింది. దీంతో ఈ చిత్రానికి బాక్సాఫీస్‌ వద్ద ఇబ్బంది కలిగించడానికి 'పంతం' చిత్రాన్ని పోటీగా విడుదల చేయించడం వెనుక దిల్‌ రాజు హస్తముందనే గుసగుసలు టాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి.

నిజానికి ఈ రెండు సినిమాల మధ్య పోటీ వద్దని ఇరు నిర్మాతలు అనుకున్నా కానీ 'పంతం'కి దిల్‌ రాజు కాంపౌండ్‌ బ్యాకింగ్‌ దొరకడంతో వాళ్లు పోటీకి సై అనేసారని గాసిప్స్‌ వున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ తన కాంపౌండ్‌నుంచి బయటకి వెళ్లిపోయిన దర్శకులు, హీరోలకి దిల్‌ రాజు ఏదో విధంగా అవరోధాలు కల్పిస్తుంటాడనే టాక్‌ మాత్రం బాగా స్ప్రెడ్‌ అవుతోంది. నిజానిజాలేమిటనేది తేజుకి, రాజుకే తెలియాలి.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English